మర్పల్లి : 18ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని వికారాబాద్ అదనపు కలెక్టర్ మోతీలాల్ అన్నారు. బుధవారం మర్పల్లి మండల కేంద్రంలోని బీరప్ప కాలనీ, బీసీ కాలనీలోని పలు కుటుంబాలను కలిసి ఇంట్లో ఎంతమంది ఉన్నారు, కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారా అంటు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ తప్పనిసరి వేసుకోవాలని, వేసుకుంటే ఆరోగ్యంగా ఉండటంతో పాటు కరోనా వ్యాధి దరిచేరదన్నారు. వ్యాక్సిన్ వేసుకుని వారిని గుర్తించి వ్యాక్సిన్ వేయించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.
అనంతరం తాసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ధరణి రిజిస్ట్రేషన్లు ఎమైనా పెండింగ్లో ఉన్నాయ అని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట తాసిల్దార్ తులసీరామ్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.