కులకచర్ల, సెప్టెంబర్ 18: అనుమతి లేనిదే క్లినిక్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు నడిపితే చర్యలు తీసుకుంటామని జిల్లా డిప్యూటీ వైద్యాధికారి డాక్టర్ జీవరాజ్ అన్నారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ పాల్వన్కుమార్ ఆదేశాలమేరకు బుధవారం చౌడాపూర్ మండల కేంద్రంలో అనుమతి లేని క్లినిక్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనుమతి లేకుండా క్ల్లినిక్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. అనుమతి లేకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న క్లినిక్ల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనుమతి ఉంటేనే నిర్వహించాలని సూచించారు. చౌడాపూర్లో సీజ్ చేసిన వాటిలో ఎస్కే డయాగ్నోస్టిక్ సెంటర్, మథిహా డయాగ్నోస్టిక్ సెంటర్, మధిహా క్లినిక్, రాజ్యలక్ష్మి ఫస్ట్ ఎయిడ్ సెంటర్, షిఫ క్లినిక్లను సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీఈఎంఓ శ్రీనివాస్, కులకచర్ల మండల వైద్యాధికారి డాక్టర్ వాజిహుద్దీన్, సీహెచ్వో సిరాజుద్దీన్, సిబ్బంది పాల్గొన్నారు.
అనుమతి లేనిదే క్లినిక్లు, డయాగ్నోస్టిక్లు నడపడం పద్ధతి కాదని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం చౌడాపూర్ మండల కేంద్రంలో జిల్లా వైద్యాధికారులు అనుమతి లేని క్లినిక్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లను సీజ్ చేయగా బాధితులు విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సీజ్చేసిన క్లినిక్లను తెరిపించేలా చూడాలని కోరగా ఆయన స్పందిస్తూ అనుమతి లేకుండా క్లినిక్లు నడపడం పద్ధ్దతి కాదని అన్నారు. అన్ని రకాల అ నుమతులతోనే క్లినిక్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లను నిర్వహిం చాలని అన్నారు. అర్హులైన వైద్యులే వైద్యం అందించాలని అన్నారు. ఈ విషయాన్ని అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని, మరోసారి ఈ విధంగా చేయడం సరికాదని అన్నారు.