తుర్కయంజాల్, జూన్ 28: హోటళ్లు, కిరాణ, వ్యాపార సముదాయాల యజమానులు తప్పని సరిగా మున్సిపాలిటి నుంచి ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని తుర్కయంజాల్ మున్సిపాలిటి కమిషనర్ అమరేందర్‌రెడ్డి అన్నారు.100 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం తుర్కయంజాల్ మున్సిపాలిటి పరిధిలో వ్యాపార సముదాయాలు, హోటళ్లు, కిరాణ షాపులను ఆకస్మికంగా తనీఖి చేశారు. ఈ సందర్భంగా ఆయన ట్రేడ్ లైసెన్స్‌లను పరిశీలించి తీసుకోని వారిని, రెన్యువల్ చేసుకోని వారిని హెచ్చరించారు. వ్యాపారుస్తులందరూ తప్పని సరిగా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని లేనట్లయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోమున్సిపాలిటీ ఆర్ఓ శ్రీనివాస్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.