ధారూరు, జనవరి 1 : నూతన సంవత్సరం మొదటి రోజు కార్యాలయాలు, విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీన్ని పురస్కరించుకొని ధారూరు మండల పరిధిలోని కోట్పల్లి ప్రాజెక్టు అందాలను తిలకించేందుకు పరిసర ప్రాంతాల ప్రజలే కాకుండా హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు భారీగా తరలివచ్చారు. ప్రాజెక్టు నీటిలో బోటింగ్ చేసేందుకు ఉత్సాహం చూపించారు. ఆహ్లాదంగా గడిపారు. ఫొటోలు దిగారు. సెల్ఫీలు తీసుకున్నారు. సాయంత్రం వరకు అక్కడే ఉండి బంధుమిత్రులతో కలిసి వన భోజనాలు చేశారు. ప్రాజెక్టు పరిధిలో ఎలాంటి ఘటనలు జరుగకుండా సీసీ కెమెరాలు, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.