ఇబ్రహీంపట్నంరూరల్, ఏప్రిల్ 10 : బీఆర్ఎస్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం ఈనెల 12న బొంగ్లూర్ సమీపంలోని ప్రమిద గార్డెన్లో నిర్వహించనున్నట్లు గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, ఇబ్రహీంపట్నం మండల పరిషత్ అధ్యక్షుడు కృపేశ్ తెలిపారు. బుధవారం ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు చిలుకల బుగ్గరాముల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ.. భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి క్యామ మల్లేశ్ గెలుపుకోసం ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని కోరారు.
ఈనెల 12న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించే బీఆర్ఎస్ సమావేశానికి మండలంలోని 14 గ్రామాలు, అనుబంధ గ్రామాల నుంచి బీఆర్ఎస్పార్టీ బాధ్యులు, ఉద్యమ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. సమావేశంలో సహకార సంఘం చైర్మన్ మహేందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు బూడిద రాంరెడ్డి, గణేశ్, బీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు జగదీశ్వర్, బీఆర్ఎస్ మండల నాయకులు భాస్కర్‌రెడ్డి, హరిప్రసాద్, నర్సింహతో పాటు ఆయా గ్రామాల ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.
మంచాల : బీఆర్ఎస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్‌ను భారీ మెజార్టీతో గెలిపిద్దామని ఆ పార్టీ మండల అధ్యక్షుడు చీరాల రమేశ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిత్యం ప్రజల కోసం పనిచేసే బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశ్‌ను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ నెల 12న నిర్వహించే ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం ప్రమిద గార్డెన్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సమావేశానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారని తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఎంపీపీ నర్మద, మండల ప్రధాన కార్యదర్శి బహదూర్, నాయకులు బస్సు పుల్లారెడ్డి, జంబుల కిషన్‌రెడ్డి, చిందం రఘుపతి, రాంరెడ్డి, ఆకారం కృష్ణ, మంకు ఇందిర, సుకన్య, జానీపాషా, నారి యాదయ్య, బద్రినాథ్గుప్తా, ఇటికల ప్రకాశ్‌రెడ్డి, రావుల శంకర్, రాజు తదితరులు పాల్గొన్నారు.