నూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావును బీఆర్ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి క్యామ మల్లేశ్, బాటసింగారం రైతు సేవా సహకార సంఘం చైర్మన్ చేగూరి భరత్కుమార్యాదవ్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. న్యాయవాది, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాంచందర్రావు, లీగల్ టీం సభ్యులు, మొయినాబాద్ తదితర మండలాలకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు కూడా కేటీఆర్కు శుభాకాంక్షలు తెలిపినవారిలో ఉన్నారు. మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితారెడ్డిని బీఆర్ఎస్ పార్టీ మొయినాబాద్ మండల శ్రేణులు హైదరాబాద్లోని ఆమె నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
– న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ