కొండాపూర్, జనవరి 2 : అక్కడికెళితే దర్జాగా మద్యం సేవస్తూ హుక్కాను(Hookah )పీలుస్తూ మత్తులో మునిగితేలోచ్చు. ఎవరైనా చూస్తారన్న బెరుకు పోలీసులోస్తారన్న భయం లేకుండా నిర్వాహకులు చూసుకుంటారు. మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి దాటే వరకు మద్యం, హుక్కాలను ఎంజాయ్ చేసేలా కేఫ్ నిర్వాహకులు వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఇదేదో అన్ని విభాగాల అనుమతులతో కొనసాగుతుందనుకుంటే పొరపాటే. కేఫ్ నిర్వాహకులు కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మేనేజ్ చేస్తూ ముందుకు సాగుతున్నారు.
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని నల్లగండ్లలో కేఫ్ నూక్ పేరిట కొనసాగుతున్న కేఫ్‌లో యథేచ్ఛగా మద్యం, హ్కూలను అందిస్తున్నారు. ఓ వైపు ప్రభుత్వం హుక్కా, డ్రగ్స్ కట్టడికి పెద్ద ఎత్తున్న ప్రచారం చేస్తుంటే.. మరోవైపు ఇలాంటి సెంటర్లను ఎంకరేజ్ చేస్తూ ప్రజలు, ముఖ్యంగా యువతను తప్పువారి పట్టిస్తున్నారు. చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఇంత జరుగుతున్న ఇటు పోలీసులకు, అటు ఎస్ఓటీ పోలీసులకు సమాచారం లేకుండానే సాగుతుండా అన్న అనుమానం వస్తుంది.
లేదా నిర్వహకులు అందించే నజరానాలకు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారా? ఇకనైనా నివాసాల మధ్య ఇలాంటి అసాంఘిక చర్యలకు పాల్పడే వారిపై అధికారులు, పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తే మంచిదని స్థానీకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పట్టుబడితే చిన్న కేసులతో సరి..
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న కేఫ్ నూక లాంటి వాటిలో పట్టుబడితే చిన్న కేసులేగా.. మేం చూసుకుంటాం అంటూ నిర్వాహకులు కస్టమర్లకు భరోసా ఇస్తున్నారు. ఇంత భరితెగించేలా ముందుకు సాగడం వెనకాలా ఎంత మంది సహాయ సహకారాలు ఉన్నాయోనని పలువురు చర్చించుకుంటున్నారు.