డంపింగ్ యార్డు వద్దే.. వద్దు
అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని బండరావిరాల గ్రామంలో ప్రతిపాది త ఎకోటౌన్ డంపింగ్‌యార్డు ఏర్పాటును వ్య తిరేకిస్తూ ఈ నెల 29న చేపట్టనున్న రంగారెడ్డి కలెక్టరేట్ ముట్టడికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ శనివారం తెలంగాణభవన్‌లో అధికారికంగా ప్రకటించారు.
- బండరావిరాలతోపాటు పరిసర గ్రామాలను కాలుష్యంగా మార్చొద్దు
- బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
- తెలంగాణ భవన్లో మాజీ ఐపీఎస్‌ను కలిసిన బండరావిరాల గ్రామస్తులు
- రంగారెడ్డి కలెక్టరేట్ ముట్టడికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు
ఆదిబట్ల, జూన్ 27 : అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని బండరావిరాల గ్రామంలో ప్రతిపాది త ఎకోటౌన్ డంపింగ్‌యార్డు ఏర్పాటును వ్య తిరేకిస్తూ ఈ నెల 29న చేపట్టనున్న రంగారెడ్డి కలెక్టరేట్ ముట్టడికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ శనివారం తెలంగాణభవన్‌లో అధికారికంగా ప్రకటించారు. బండరావిరాల సర్పంచ్ విజయ్‌కుమార్‌తోపాటు పార్టీ నాయకులు, గ్రామస్తులు తెలంగాణభవన్‌లో ప్రవీణ్‌కుమార్‌ను కలిసి ముట్టడికి మద్దతు కోరగా..బీఆర్ఎస్ మద్దతు ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చా రు.
ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. గతంలో క్రషర్లకు వ్యతిరేకంగా సుమా రు 400 రోజులపాటు పోరాడి విజయం సాధించిన బండరావిరాలవాసులు ఇప్పుడు డంపింగ్‌యార్డుకు వ్యతిరేకంగా మరో ఉద్యమానికి సిద్ధమయ్యారన్నారు. జవహర్‌నగర్ తరహాలో హైదరాబాద్ నగరంలోని చెత్తను బండరావిరాలకు తరలించే ప్రయత్నం జరుగుతున్నదని ఆరోపించారు. బండరావిరాలతోపాటు చిన్నరావిరాల, పిల్లాయిపల్లి, పెద్దగూడెం, జగత్పల్లి, దేశ్ముఖి, కవాడిపల్లి, బాచారం సహా దాదాపు 15 గ్రామాల ప్రజలు తీవ్ర కాలుష్య ప్రభావానికి గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
డంపింగ్ యార్డు ప్రతిపాదనను పూర్తిగా విరమించుకునే వరకు ప్రజలతో కలిసి ఉద్యమం కొనసాగిస్తామన్నారు. కాగా, కలెక్టరే ట్ ముట్టడికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను ప్రవీణ్‌కుమార్ ఆవిష్కరించారు. కార్యక్రమం లో బీఆర్ఎస్ అబ్దుల్లాపూర్‌మెట్ మండలాధ్యక్షుడు కిషన్‌గౌడ్, బండరావిరాల సర్పంచ్ విజయకుమార్, సీనియర్ నాయకులు దానేశ్, దయాకర్‌రెడ్డి, ఉపసర్పంచ్ శంకర్ ముదిరాజ్, వార్డు సభ్యులు అనూష, భరత్‌యాదవ్, యువనాయకులు శివశంకర్, శ్రీకాంత్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

