వికారాబాద్, జనవరి 7 : ఇంటి నుంచి వెళ్లిపోయిన తల్లి తిరిగి ఇంటికి రావాలని కన్న పిల్లలు తల్లడిల్లుతున్నారు. మూడు నెలల కింద వెళ్లిన తల్లి తిరిగి రాకపోవడంతో చిన్నారులు ఎక్కడున్నావమ్మ.. తిరిగి ఇంటికి రా.. అంటూ కన్నీళ్లు పెడుతున్నారు.
వికారాబాద్ మండలంలోని పీలారం గ్రామానికి చెందిన హరిజన్ బీమయ్య, భార్య అనితలకు అకిల్ (13), సంపత్ (11) పిల్లలు ఉన్నారు. మూడు నెలల కిందట గొడవ పడి తల్లి వెళ్లి పోయింది. వికారాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది. ఎవరికైనా కనిపిస్తే వికారాబాద్ పోలీస్ స్టేషన్ లేదా తన తండ్రి బీమయ్య 9381780410 మొబైల్కు సమాచారం ఇవ్వాలని చిన్నారులు వేడుకుంటున్నారు.