Talakondapally | కడ్తాల్, ఏప్రిల్ 13 : తమతో పదవ తరగతి వరకు కలిసి చదువుకోని అనారోగ్యంతో మరణించిన స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచారు తోటి మిత్రులు. తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన చింతకుంట్ల రాజు అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందాడు. చనిపోయిన మిత్రుడి కుటుంబాన్ని ఆదివారం చిన్ననాటి స్నేహితులు కలిసి పరామర్శించారు.
ఈ సందర్భంగా స్నేహితుడి కుటుంబానికి తోటి మిత్రులు రూ.12 వేలు ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిత్రుడి కూతురిని చదివించడంతోపాటు కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని వారు భరోసాన్నిచ్చారు. ఈ కార్యక్రమంలో గణేశ్, రాజు, శ్రీశైలం, వెంకటేశ్‌యాదవ్, శ్రీకాంత్, శ్రీరాములు, శివ, ఆంజనేయులు, కిరణ్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.