తాండూరు : తాండూరు పట్టణ సమీపంలోని రాజీవ్ స్వగృహ ఇండ్లను గురువారం జిల్లా కలెక్టర్ నిఖిల పరిశీలించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజల సొంతింటి కళ నెరవేర్చేందుకు అప్పటి ప్రభుత్వం 173 ఇండ్లకు మంజూరు చేసి నిర్మాణం పనులు ప్రారంభించింది. ఇందులో కొన్ని నిర్మాణం దశలోనే ఉన్నాయి. రాజీవ్ సృగృహ పథకం ప్రభుత్వంకు భారం కావడంతో నిర్మాణాలు చేపట్టిన బహిరంగ వేలం వేయడంతో 173లో 101 ఇండ్లను పలువురు కొనుగోలు చేశారు. మిగిలిన 72 నిర్మాణాలకు త్వరలో విక్రయించేందుకు వేలం పెట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
అందుకు పూర్తి వివరాలను తెలుసుకునేందుకు, పారదర్శకంగా వేలం వేసేందుకు చర్యలు తీసుకునేందుకు జిల్లా కలెక్టర్ పరిశీలిన చేసినట్లు తెలిపారు. ఇండ్లను తీసుకోవాలి అనుకునేవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు కలెక్టర్ కార్యాలయంలోని సహయకేంద్రంను సంప్రదించాలని సూచించారు.