వికారాబాద్, అక్టోబర్ 12 : తెలంగాణ సంస్కృ తి సంప్రదాయాలు ఉట్టిపడేలా వికారాబాద్ పట్టణంలో ఆయా పాఠశాలల విద్యార్థినులు బతుక మ్మ సంబురాలను గురువారం ఘనంగా జరుపుకొన్నారు. బాలికల పాఠశాల, ప్రభుత్వ పాఠశాలలు, సరస్వతీ శిశుమందిర్, న్యూ నాగార్జు తదితర పాఠశాలల్లో చిన్నారులు బతుకమ్మ సంబురాలు జరుపుకొన్నారు. ముందుగా వివిధ రకాల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, పూజ లు చేశారు. బతుకమ్మ ఆటపాటలతో గౌరమ్మను కొలిచారు. ఆడపడుచులు అంతా ఒక్కచోట చేరి బతుకమ్మ సంబురాలు చేసుకున్నారు. చిన్నారు లు సైతం బతుకమ్మలను అందంగా పేర్చి పూ జలు చేశారు. అనంతరం సమీపంలోని కొలనులో, నీటి తొట్లలో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయు లు, ఉపాధ్యాయులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
కొడంగల్ : దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బతుకమ్మ వేడుకలను గురువారం పట్టణంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, మండలంలోని హస్నాబాద్ ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఘనంగా జరుపుకొన్నారు. తీరొక్క పూలతో బతుకమ్మను అలంకరించి, ఆట పాటలతో వేడుకలను ఆనందోత్సాహాల నడుమ జరుపుకొ న్నారు. దసరా సెలవుల సందర్భంగా విద్యార్థులతో కలిసి బతుకమ్మ సంబురాలను జరుపుకొన్నామని జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం, ఎంఈవో రాంరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.
బొంరాస్పేట : మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో గురువారం బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. పాఠశాలలకు శుక్రవారం నుంచి దసరా సెలవులు ప్రారంభం కానుండడంతో ఒకరోజు ముందుగానే బతుకమ్మ సంబురాలు చేసుకున్నారు. విద్యార్థినులు, ఉపాధ్యాయులు తీరొక్క పూలతో అందంగా బతుకమ్మలను తయారు చేశారు. బతుకమ్మలకు పూ జలు చేసి వాటి చుట్టూ పాటలు పాడుతూ కోలాటాలు ఆడుతూ సందడి చేశారు. అనంతరం చెరువులలో బతుకమ్మలను వదిలి పెట్టారు.