ఆదిబట్ల, డిసెంబర్ 18 : తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని పాఠశాల విద్యా శాఖ సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట వంటావార్పు నిర్వహించి భోజనాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాఠశాల విద్యా శాఖ సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయడంతోపాటు తక్షణమే స్కేల్ అమలు చేసే వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లే నిపక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు పాల్గొన్నారు.
ధారూరు : జిల్లాలోని వివిధ మండలాల్లో స ర్వ శిక్షా అభియాన్లో పని చేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వం వెంటనే క్రమబద్ధీకరించాలని పీఆర్టీయూ మండల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం వికారాబాద్ జిల్లా కేం ద్రంలో ఎస్ఎస్ఏ ఉద్యోగులు నిర్వహిస్తున్న సమ్మెకు మండల శాఖ తరఫున వెళ్లి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ మండల శాఖ తరఫున రూ.11వేలు, రాష్ట్ర అ సోసియేట్ అధ్యక్షుడు జీహెచ్ఎం రమేశ్ రూ.2వేలు ఆర్థికసాయం అందజేశారు. అనంతరం సంఘం నాయకులు మాట్లాడుతూ.. ఎస్ఎస్ఏ ఉద్యోగులను క్రమబద్ధీకరించడం తో పాటు ఉద్యోగ విరమణ తర్వాత వారికి ఆర్థిక భరోసా ఇవ్వాలన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ ధా రూరు మండల అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మాణిక్యం, జీహెచ్ఎం రమేశ్, మ హిళా విభాగం జిల్లా కార్యదర్శి శివాని, గౌరవ అధ్యక్షుడు మల్లికార్జు న్ ఎస్ఎస్ఏ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.