కేశంపేట, జులై 10 : అత్త గొడవపడిందన్న కారణంగా వ్యక్తి పెట్రోల్ తాగిన ఘటన రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు, 108సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సంగెం గ్రామానికి చెందిన అనిల్(30) బోనాల పండగకోసం తన అత్తగారి గ్రామమైన కోనాయపల్లికి వచ్చాడు.
తన భార్యను వెంట తీసుకెళతానని చెప్పడంతో అతని అత్త రెండు రోజులు గడిచాక పంపిస్తానని చెప్పిందని, దీంతో అతను కుదరని చెప్పడంతో గొడవ పెద్దదైందని తెలిపారు. మనస్థాపానికి గురైన అనిల్ పెట్రోల్ తాగాడని, ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించడంతో బాధితున్ని షాద్నగర్ ప్రభుత్వ దవాఖానలో చేర్పించినట్లు తెలిరు. ప్రస్తుతం అనిల్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.