నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు
నకిలీ విత్తనాలు అమ్మితే డీలర్లపై చర్యలు తప్పవని శంకర్పల్లి మండల వ్యవసాయాధికారి సురేశ్‌బాబు, డిప్యూటీ తహసీల్దార్ ప్రియాంక అన్నారు. శుక్రవారం శంకర్పల్లి మండల కేంద్రంలో ఎస్ఐ సంతోష్‌తో కలిసి ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు.
- మండల వ్యవసాయ శాఖ అధికారులు
- జిల్లాలో ఫర్టిలైజర్ దుకాణాల తనిఖీలు
- స్టాక్ వివరాల పరిశీలన
షాబాద్, మే 31: నకిలీ విత్తనాలు అమ్మితే డీలర్లపై చర్యలు తప్పవని శంకర్పల్లి మండల వ్యవసాయాధికారి సురేశ్‌బాబు, డిప్యూటీ తహసీల్దార్ ప్రియాంక అన్నారు. శుక్రవారం శంకర్పల్లి మండల కేంద్రంలో ఎస్ఐ సంతోష్‌తో కలిసి ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు. అనంతరం దుకాణాల్లో సీడ్స్టాక్, రిజిస్టర్, గ్రౌండ్ స్టాక్, బిల్‌బుక్స్, స్టాక్‌బోర్డు తదితర వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభు త్వం ద్వారా గుర్తింపు పొందిన ఫర్టిలైజర్ దుకాణాల్లో మాత్రమే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. ఏ డీలరైనా విత్తనాలను ఎమ్మార్పీ ధర కంటే అధిక ధరలకు విక్రయిస్తే, కృత్రిమ కొరత సృష్టించిన డీలర్లపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో సిబ్బంది తదితరులున్నారు.
నకిలీ విత్తనాలను విక్రయిస్తే చర్యలు
చేవెళ్లటౌన్ : నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ కిష్టయ్య, చేవెళ్ల మండల వ్యవసాయ శాఖ అధికారిణి తులసి అన్నారు. మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు లూజు విత్తనాలను కొనకూడదని సూచించారు. రైతులు విత్తనాలు విక్రయించే సమయంలో తప్పనిసరిగా వారికి బిల్లులను ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్ఐ రాజేశ్, వ్యవసాయ అధికారులు, ఎస్ఐ పాల్గొన్నారు.
కడ్తాల్ : నకిలీ విత్తనాలను అమ్మే వారిపై చట్టపరమైన చర్య లు తీసుకుంటామని సీఐ శివప్రసాద్ హెచ్చరించారు. మండల కేంద్రంలోని ఫర్టిలైజర్స్ షాపుల్లోని విత్తనాలు, ఎరువుల నిల్వలను మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీలతతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విత్తనాలు కొనుగోలు చేసే రైతులకు తప్పనిసరిగా రసీదులు ఇవ్వాలని సూచించారు. ఈ-పాస్ ద్వారానే ఎరువులు విక్రయించాలని, నకిలీ విత్తనాలను విక్రయించి రైతులను మోసగించే వారిని ఉపేక్షించేదిలేదని పేర్కొన్నారు. దుకాణాల ఎదుట ధరల పట్టికను, ఎరువుల నిల్వలు సూచించే బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీటీ వినోద్‌కుమార్, ఏఈవో అభినవ్, అధికారులు పాల్గొన్నారు.
స్టాక్ రిజిస్టర్ రోజువారీగా నమోదు చేయాలి
కొత్తూరు : ఎరువుల దుకాణ యజమానులు స్టాక్ రిజిస్టర్‌ను రోజువారీగా నమోదు చేయాలని మండల వ్యవసాయ అధికారి గోపాల్ అన్నారు. మండల టాస్క్‌ఫోర్స్ టీం ఆధ్వర్యంలో శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో గోపాల్ మాట్లాడుతూ.. విత్తనాలు కొన్న రైతులకు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలన్నారు. ప్యాకెట్ పై ఉన్న ఎమ్మార్పీ ధరకే విక్రయించాలని సూచించారు. విత్తనాలు కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
మండలంలో 500ల పైగా ప్యాకెట్ల పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రతి రైతుకు విత్తనాలు సరఫరా చేయాలన్నారు. అదేవిధంగా యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులు తమ ఆధార్ కార్డులు తీసుకొచ్చి ఈపీఓఎస్ మిషన్ ద్వారా విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్ టీం సభ్యులు నాయబ్ తహసీల్దార్ జంగయ్య, సీఐ నరసింహారావు, ఎస్ఐ శ్రీనివాస్ పాల్గొన్నారు.
షాద్‌నగర్‌టౌన్ : నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని మండల వ్యవసాయాధికారి నిశాంత్‌కుమార్ హెచ్చరించారు. పట్టణంలోని విత్తన, ఎరువులు డీలర్ల దుకాణాలను షాద్‌నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామిరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్‌తో కలిసి తనిఖీ చేశారు. దుకాణాల్లోని రికార్డులు, పలు విత్తనాల ప్యాకెట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విత్తనాలను కొనుగోలు చేసిన రైతులకు తప్పకుండా రసీదు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
యాచారం : నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని మండల వ్యవసాయాధికారి సందీప్ హెచ్చరించారు. మండలంలోని మాల్, యాచారం, మల్కీజ్‌గూడ గ్రామాల్లోని ఫర్టిలైజర్ దుకాణాలను పోలీసులు, రెవెన్యూ అధికారులతో కలిసి ముమ్మరంగా తనిఖీలు చేశారు. కార్యక్రమంలో ఎస్ఐ వెంకటనారాయణ, ఆర్ఐ రామకృష్ణ, వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amitabh Bachchan | బుల్లెట్ ప్రూఫ్ కవచం వెనుక అమితాబ్ బచ్చన్.. అభిమానుల కోసం భద్రత నడుమే ప్రత్యేక దర్శనం!
Mamitha Baiju | మమితా బైజు అసలు పేరు నమితనా? బర్త్ సర్టిఫికెట్లో జరిగిన పొరపాటుతో పేరు ఎలా మారిందో తెలుసా?
Plane Crash | ట్రంప్ నివాసానికి సమీపంలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. తొమ్మిది మంది మృతి
Cyclone Murasu | తీవ్ర తుపానుగా బలపడిన ‘మురాసు’.. ఏపీ తీరానికి పొంచి ఉన్న పెను ముప్పు!
గ్లామర్ డోస్ పెంచేసిన హెబ్బా పటేల్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బోల్డ్ ఫొటోషూట్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

