వికారాబాద్, మార్చి 9 : శివరాత్రిని పురస్కరించుకొని శనివారం మండలంలోని పలు ఆలయాల్లో పార్వతీపరమేశ్వరుల కల్యాణం కనుల పండువలా జరిగింది. పార్వతీపరమేశ్వర గుట్టపై, బుగ్గ రామలింగేశ్వరాలయం తదితర శివాలయాల్లో ఈ వేడుకలను భక్తిశ్రద్ధల తో నిర్వహించారు. భక్తులు ఆలయాలకు శివపార్వతుల విగ్రహాలను పల్లకీలో తీసుకొచ్చా రు.
ఆలయాల సమీపంలో ఏర్పాటు చేసిన కల్యాణ మండపంలో శివపార్వతులకు భక్తు లు ఘనంగా కల్యాణం చేశారు. స్వామివారి కల్యాణాన్ని చూసేందుకు వికారాబాద్‌తో పాటు చుట్టు పక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీ య ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల మాజీ సర్పంచ్‌లు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
తాండూరు రూరల్ : మండల పరిధిలోని అం తారంతండాలో భూ కైలాస్ ఆలయంలో శనివారం శివపార్వతుల కల్యాణోత్సవం వైభవం గా జరిగింది. శంకర్‌నాయక్, వాసునాయక్ ఫవార్ దంపతులు శివపార్వతుల కల్యాణాన్ని వైభవంగా జరిపారు. అంతకుముందు పల్లకీసేవ నిర్వహించారు. కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. మహోత్సవాలను తిలకించేందుకు వచ్చిన భ క్తులకు అన్నదానం చేశారు.
బషీరాబాద్ : మండలంలోని జీవన్గి కాగ్నానది ఒడ్డున వెలసిన మహా దేవలింగేశ్వరుడి జాతర ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శనివా రం తెల్ల వారుజామున అగ్నిగుండం, పల్లకీ సేవ, సాయంత్రం పార్వతీపరమేశ్వరుల కల్యా ణం, రథోత్సవం తదితర కార్యక్రమాలు ఘ నంగా జరిగాయి. శివరాత్రి జాగరణలో భాగం గా శుక్రవారం రాత్రి గ్రామస్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఆలయ సమీపంలోని అగ్ని గుండంలో గ్రామస్తులు, భక్తులు నడిచారు.
జాగారం చేసిన భక్తులు, గ్రామస్తులకు ఆల య కమిటీ నిర్వాహకులు పండ్లు పంపిణీ చే శారు. కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చిన ముత్య (గురువు) మాట్లాడుతూ భక్తితోనే మనిషికి ముక్తి లభిస్తుందని, మానసిక ప్రశాంతత వస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాణిక్‌రెడ్డి, మునిందర్‌రెడ్డి, వీరారెడ్డి, నర్సిరెడ్డి, హంపిరెడ్డి, మల్లికార్జున్, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆలయ సమీపంలోని కల్యాణ మండపంలో పార్వతీపరమేశ్వరుల కల్యాణం వైభవంగా జ రిగింది. గ్రామస్తులు పక్క గ్రామాలకు చెందిన ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి వారి కల్యాణాన్ని వీక్షించారు.
పెద్దేముల్ : మండల కేంద్రంలోని స్వయం భూ శ్రీ శంభులింగేశ్వరాలయంలో శుక్రవారం రాత్రి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివ పార్వతుల కల్యాణం కనుల పం డువగా సాగింది. ఆలయ ధర్మకర్త నరేశ్‌రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో హాజరైన భక్తుల సమక్షంలో వేదపండి తులు కల్యాణాన్ని ఘనంగా జరిపించారు. అనంతరం భ క్తులు, గ్రామస్తులకు తీర్థప్రసాదాలు అందించా రు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు శివనామ స్మరణతో మార్మోగాయి.
పరిగి : మండలంలోని సయ్యద్‌పల్లి గ్రామం లో మహాశివరాత్రి ఉత్స వాల్లో భాగంగా శనివారం మల్లికార్జున స్వామి ఆలయంలో శివపార్వతుల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహ న్‌రెడ్డి-ఉమాదేవి దంపతులు పాల్గొన్నారు. అంతకుముందు వారు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు పరశురాంరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
కులకచర : మండలంలోని బండవెల్కిచర్ల పాంబండ రామలింగేశ్వరా లయ బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. మహాశివరాత్రిని పురస్కరిం చుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం అమావాస్యతో ఈ బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
చౌడాపూర్ మండలంలోని మందిపల్‌లో హోం కారేశ్వర స్వామి ఆలయ ఉత్సవాలను రెండు రోజులపాటు ఘనంగా నిర్వహించా రు. మహాశివరాత్రిని పురస్కరించుకొని హోం కారేశ్వరాలయంలో శివపార్వ తుల కల్యాణం, పలు పూజా కార్యక్రమాలను అర్చకుడు రాజశేఖర్, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేశారు.