వికారాబాద్, డిసెంబర్ 30, (నమస్తే తెలంగాణ) : నూతన సంవత్సర వేడుకలకు జిల్లాలో కట్టదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించి ప్రశాంతవాతావరణంలో సంబురాలు జరుపుకోవాలని కోరారు. రిసార్టులు, ఫాంహౌజ్లపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు.
నిబంధనలు అతిక్రమించినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 31వ తేదీ రాత్రి జిల్లావ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నాకాబందీ, వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. పోలీస్ అధికారుల సలహాలు, సూచనలు పాటించి సహకరించాలని కోరారు.
నిబంధనలివే..