నందిగామ, డిసెంబర్ 14 : సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ఆపదలో ఉన్న పేద ప్రజలకు వరం లాంటిదని, సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండలం ఉమ్మడి మామిడిపల్లి గ్రామానికి చెందిన షేక్ మహ్మద్‌కు రూ.60 వేలు, హరీశ్వర్‌రెడ్డికి రూ.46 వేలు, కారె కృష్ణయ్యకు రూ.24 వేల విలుక కలిగిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ బుధవారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందని, ప్రభుత్వ దవాఖానలలో మెరుగైన వైద్య సేవలను ప్రభుత్వం అందిస్తున్నదని తెలిపారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం పని చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జ్ఞానేశ్వర్, శ్రీపాల్‌రెడ్డి, సుదర్శన్, రామకృష్ణరెడ్డి, శేఖర్ తదితరులు ఉన్నారు.
సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయం
సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని జడ్పీటీసీ దశరథ్‌నాయక్ అన్నారు. మండల పరిధిలోని గాన్గుమార్లతండా పంచాయతీలోని పోచమ్మగడ్డ తండాకు చెందిన జర్పుల చిట్టికి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ సహకారంతో రూ.20 వేలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు మంజూరయ్యింది. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారురాలికి జడ్పీటీసీ సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, ఏఎంసీ, పీఏసీఎస్ డైరెక్టర్లు లాయక్‌అలీ, సేవ్యానాయక్, జంగయ్య, నాయకులు లక్పతీనాయక్, పాండు, శ్రీను, భీమన్, జాన్యా, కుమార్, దేవులా, టీకులాల్, రాజు, జగన్ తదితరులు పాల్గొన్నారు.