ఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 12 : హిందువులు జరుపుకొనే పండుగల్లో సంక్రాంతి ఒకటి. దీనిని చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ సంతోషంగా నిర్వహించుకుంటారు. సరదాల సంక్రాంతిని ఘనంగా జరుపుకొనేందుకు పట్నాలు, నగరాల నుంచి ప్రజలు గ్రామాలకు చేరుకోవడంతో అక్కడ సందడి నెలకొన్నది.
గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల కీర్తనలతో మూడు రోజులపాటు గ్రామాలు, పట్టణాలు కళకళలాడనున్నాయి. గాలిపటాలు ఎగురవేయడంలో యువత నిమగ్నమైనది. వివిధ రకాల ఆకారాల్లో ఉన్న గాలిపటాలు, రంగుల ప్యాకెట్ల కొనుగోలులో బిజీగా ఉండడంతో షాపులు కిటకిటలాడుతున్నాయి.