రెవెన్యూ అధికారులపై దాడి..
తుర్కయాంజాల్‌లో వివాదా స్పద భూమిని పరిశీలించేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులపై ఓ మహిళ దాడికి దిగింది. నా భూమిలోకి ఎందుకొచ్చారంటూ అబ్దుల్లాపూర్‌మెట్ ఆర్ఐ ప్రేమ్‌కుమార్, జీపీవో హన్మంతు నాయక్‌పై దాడి చేసి గల్లపట్టి బూతులు అందుకున్నది.
- వివాదాస్పద భూమిని పరిశీలించేందుకు వెళ్లిన ఆఫీసర్లు..
- దుర్భాషలాడుతూ దాడి చేసిన మహిళ… ఠాణాలో ఫిర్యాదు
రంగారెడ్డి, జూన్ 19 (నమస్తే తెలంగాణ)/తుర్కయాంజాల్ : తుర్కయాంజాల్‌లో వివాదా స్పద భూమిని పరిశీలించేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులపై ఓ మహిళ దాడికి దిగింది. నా భూమిలోకి ఎందుకొచ్చారంటూ అబ్దుల్లాపూర్‌మెట్ ఆర్ఐ ప్రేమ్‌కుమార్, జీపీవో హన్మంతు నాయక్‌పై దాడి చేసి గల్లపట్టి బూతులు అందుకున్నది. మీరు రెవెన్యూ అధికారులు అయితే ఐడీ కార్డులు చూపించాలంటూ పోలీస్‌స్టేషన్ వరకు లాక్కోని వెళ్లింది. ఆర్ఐ ఐడీ కార్డు చూపించినా దానిని లాక్కునేందుకు యత్నించింది. ఈ భూమిలోంచి వెంటనే వెళ్లి పోవాలని అధికారుల కారుపై రాళ్లు వేసేందుకు యత్నించింది.
తుర్కయాంజాల్ రెవెన్యూ సర్వే నంబర్ 338లో గల 1,810 గజాలపై కొంతకాలంగా ఓ మహిళ.. కొంతమంది గిరిజనులకు మధ్య వివాదం సాగుతున్నది. తరచూ ఘర్షణ జరుగుతుండడంతో బీఎన్ఎస్ 164 సెక్షన్ కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని పోలీసులు ఇబ్రహీంపట్నం ఆర్డీవోను కోరారు. కాగా, అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ ఆదేశాల మేరకు శుక్రవారం ఆర్ఐ ప్రేమ్‌కుమార్, జీపీవో హన్మంత్‌నాయక్ ఆ భూమి వద్దకు వెళ్లారు. విషయం తెలుసుకున్న మహిళ ఒక్కసారిగా వారిపై దుర్భషలాడుతూ దాడికి దిగింది. దీంతో ఆర్ఐ, జీపీవోలు ఆదిబట్ల ఠాణాలో ఫిర్యాదు చేశారు.
ఠాణా ఎదుట రెవెన్యూ ఉద్యోగుల ఆందోళన..
విధి నిర్వహణలో ఉన్న రెవెన్యూ సిబ్బందిపై మహిళ దాడి చేసి విధులకు ఆటంకం కలిగించిందని ఆర్ఐ, జీపీవో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని రెవెన్యూ అధికారులు శుక్రవారం ఠాణా ఎదుట ఆందోళనకు దిగారు. ఆదిబట్ల సీఐ రవికుమార్ ఘటనపై విచారిస్తున్నా రని.. అనంతరం ఆ మహిళపై చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులకు నచ్చ జెప్పడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు : విజయ రమణారావు
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో నాలుగు వెంటిలేటర్లు మాయం.. సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డు!
Sandeep Reddy Vanga | రాప్తాడు ఘటనపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్.. విషాదాన్ని అవకాశంగా మార్చుకోవద్దు!
Suspension | కామారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 14 మంది మెడికోలపై సస్పెన్షన్!
Jagtial Child | జగిత్యాల చిన్నారి ఘటనలో ట్విస్ట్.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని కలెక్టర్ పిటిషన్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

