షాబాద్ : జిల్లాలోని వివిధ ఫ్రైవేట్ సంస్థల్లో నియమకాల కోసం ఈ నెల 29న ఆన్లైన్ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా ఉపాధి అధికారి జయశ్రీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మసీ హైదరాబాద్ నందు 100 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయన్నారు. వయస్సు 18-26 సంవత్సరాల లోపు ఉండాలని చెప్పారు. జీతం రూ. 12వేలు ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 29న మధ్యాహ్నం 2గంటలకు జరిగే ఆన్లైన్ జాబ్‌మేళాలో పాల్గొనలన్నారు. మీటింగ్ ఐడీ-74019848923, పాస్ కోడ్-123456, ఇతర వివరాలకు 8247656356ను సంప్రదించాలని కోరారు.