వికారాబాద్ : టీబీ నియంత్రణకు ఉద్యోగులు మరింత కృషి చేయాలని డబ్ల్యూహెచ్వో కన్సల్టెంట్ శ్రీగుణ తెలిపారు. గురువారం వికారాబాద్ అనంతగిరిలోని పాత డీఎంహెచ్వో కార్యాలయంలో టీబీ వైద్యులు, ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2018 నుంచి రెండు సంవత్సరాలు తాత్కాలిక పద్ధతిన పని చేసిన సిబ్బంది సేవలను గుర్తించారు. టీబీ రోగులను గుర్తించి వారికి సరైన చికిత్సలు, సలహాలు, సూచనలు చేసేవారని తెలిపారు. టీబీ వ్యాధి కుటుంబ సభ్యులకు సోకకుండా ముందుస్తు జాగ్రత్తలు చేపట్టేందుకు ఎంతో కృషి చేశారన్నారు. 10మంది ఉద్యోగులు 2 సంవత్సరాలు పని చేయడం జరిగిందన్నారు.
తాత్కాలిక ఉద్యోగుల సమయం పూర్తి కావడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల సహకారంతో పనులు చేయాలని సూచించారు. అనంతరం రోగులకు మందులు, మాత్రలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ రవీంద్రయాదవ్, వైద్యులు రవీందర్, కిరణ్కుమార్, సిబ్బంది విజేందర్, హైదర్ ఉన్నారు.