షాబాద్ : ఉమ్మడి రంగారెడ్డిజిల్లా డీసీసీబీ (హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు లిమిటెడ్) పాలకవర్గ సమావేశం బుధవారం చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. నగరంలోని డీసీసీబీ ఉమ్మడిజిల్లా బ్యాంకు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బ్యాంకుల్లో డిపాజిట్లు, పీఏసీఏస్ విత్ బ్యాంకు కంప్యూటరైజేషన్, పెట్టుబడులు, లోనింగ్, రికవరీ ఎడ్యూకేషన్ లోన్ లిమిట్ రూ. 10లక్షల వరకు, వీధి వ్యాపారులకు రూ. 20వేల వరకు లోన్ లిమిట్ పెంచడం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ సత్తయ్య, బ్యాంకు డైరెక్టర్లు, డీసీవో, బ్యాంకు సీఈవో, జిఎం, డీజీఎంలు బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.