e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 20, 2022
Home రంగారెడ్డి Rangareddy : చరిత్ర భావితరాలకు తెలిసేలా పాఠ్య పుస్తకంలోకి..

Rangareddy : చరిత్ర భావితరాలకు తెలిసేలా పాఠ్య పుస్తకంలోకి..

  • మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి
  • చేవెళ్ల మండల కేంద్రంలో ఐలమ్మ విగ్రహావిష్కరణ
  • హాజరై ఎమ్మెల్యే కాలె యాదయ్య

చేవెళ్ల టౌన్‌ : భావితరాలకు మహానీయురాలి చరిత్ర తెలువాలని 5వ తరగతిలో చాకలి ఐలమ్మ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా పెట్టడం జరిగిందని మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని చేవెళ్ల మండల కేంద్రంలో ఆమె విగ్రహాన్ని ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమైక్య రాష్ట్రంలో మరుగున పడ్డ వారిని మఖ్యమంత్రి కేసీఆర్‌ గుర్తిస్తూ వారికి గుర్తింపు, సముచిత గౌరవం ఇస్తున్నారని తెలిపారు.

- Advertisement -

భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం పోరాడిన మహానీయురాలు చాకలి ఐలమ్మ అని కొనియాడారు. కుల వృత్తులు, సబ్బండ వర్గాలకు న్యాయం చేస్తున్న ఏకైక ప్రభుత్వం సీఎం కేసీఆర్‌ ప్రభుత్వమన్నారు. రూ. 10నుంచి 15లక్షల వరకు మోడ్రన్‌ లాండ్రిల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. చేవెళ్లలో రజక భవనం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. యావత్‌ మహిళా లోకానికి ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ పోరాట యోధులను సీఎం కేసీఆర్‌ గౌరవిస్తూ వారికి సముచిత స్థానాన్ని కల్పించడం హర్షిందగ్గ విషయమన్నారు. అన్ని కులాలకు సముచిత స్థానం, న్యాయం కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement