షాద్నగర్ రూరల్, అక్టోబర్ 26 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో నిరుపేదలకు ఆరోగ్యం క్షీణిస్తే పట్టించుకునే వారు ఉండేవారు కాదు. మరుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు నిరుపేదలు అనారోగ్యంతో బాధపడుతూ కార్పొరేట్లో వైద్యం చేయించుకోలేక ఇంట్లోనే కాలం వెల్లదీసేవారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. గ్రామీణ ప్రాంతాలు, తండాలు, పట్టణాల్లో సర్కారు దవాఖానలను విస్తృతంగా ఏర్పాటు చేయడంతో పాటు కార్పొరేట్ స్థాయిలో ఆధునిక వసతులతో వైద్యం అందిస్తుండటంతో నిరుపేదలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే నిరుపేదల ఆరోగ్యానికి మరింత భరోసా కల్పించే విధంగా సీఎం సహాయనిధి ద్వారా ఆర్థికసాయం అందిస్తున్నది. ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న వారు ధైర్యంగా ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స పొం దుతూ సహాయనిధికి దరఖాస్తు చేసుకుంటున్నారు. దరఖా స్తు చేసుకునేవారందరికీ సీఎం సహాయనిధి అందుతుండటం తో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో సు మారు రూ. 4 కోట్లకు పైగా సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిన వెంటనే సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యేలా ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కృషి చేస్తున్నారు.