కడ్తాల్, అక్టోబర్ 26 : సమాజంలో ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని పెంపొందించుకొని సన్మార్గంలో నడవాలని జడ్పీటీసీ దశరథ్‌నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని శివాలయం ఆవరణలో గంప లక్ష్మయ్య చారిటబుల్ ట్రస్టు చైర్మన్ వెంకటేశ్‌గుప్తా ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు నిత్యఅన్నదాన (భిక్ష) కార్యక్రమాన్ని జడ్పీటీసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిన చింతన కలిగి ఉండాలన్నారు. అంతకుముందు అయ్యప్పస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు వీరయ్య, టీఆర్ఎస్ యువజన విభాగం మండలాధ్యక్షుడు ఇర్షాద్, గురు స్వాములు భీముడు, అంజయ్య, విజయ్‌గౌడ్, మాలధారులు జగత్‌రెడ్డి, రాజు, శ్రీనివాస్, లక్ష్మయ్య, శ్రీశైలం, మల్లేశ్, అశోక్‌రెడ్డి, శ్రీకాంత్, రామకృష్ణ, శ్రీనూనాయక్, మహేందర్‌రెడ్డి, నర్సింహ, యాదయ్య, ప్రవీణ్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
మండలంలో కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరినీ ట్రస్టు తరఫున ఆదుకుంటామని కడ్తాల్ జడ్పీటీసీ, రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ దశరథ్‌నాయక్ అన్నారు. మండల పరిధిలోని ముద్విన్, చరికొండ, మర్రిపల్లి గ్రామాల్లో మూడు రోజుల క్రితం వివిధ కారణాలతో బెల్లంకొండ రామస్వామి, చాకలి నారయ్య, ఏదుల కృష్ణమ్మ మృతి చెందారు. బుధవారం ఆయా గ్రామాల్లోని బాధిత కుటుంబాలను స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి జడ్పీటీసీ పరామర్శించారు. మరణించిన కుటుంబాలకు రాధాకృష్ణ ట్రస్టు తరఫున ఐదు వేల చొప్పున రూ.15 వేలు ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు యాదయ్య, భారతమ్మ, భాగ్యమ్మ, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు వీరయ్య, పీఏసీఎస్ డైరెక్టర్లు వెంకట్‌రెడ్డి, వెంకట్‌యాదవ్, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) గ్రామాధ్యక్షులు కృష్ణారెడ్డి, జంగయ్యయాదవ్, వార్డు సభ్యులు యాదమ్మ, నర్సింహ, నాయకులు నర్సింహాగౌడ్, జంగయ్యగౌడ్, సాబేర్, దశరథ్, సత్యం, శ్రీనుయాదవ్, లక్ష్మయ్య, రాములు, శ్రీశైలంయాదవ్, సాయిలు, కుమార్, రమేశ్, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.