చేవెళ్ల రూరల్, సెప్టెంబర్ 11 : ఆసరా పింఛన్లతో సీఎం కేసీఆర్ పేదలకు భరోసా కల్పిస్తున్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవెళ్ల మండల పరిధిలోని ఈర్లపల్లి, ఎన్కేపల్లి, గొల్లపల్లి, కమ్మెట గ్రామాల్లో ఆదివారం నూతన పింఛన్ కార్డులను ఎంపీపీ విజయలక్ష్మి, ఎంపీడీవో రాజ్‌కుమార్‌తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికీ ఫలాలు అందేలా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతున్నదన్నారు. నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న టీఆర్ఎస్ పార్టీకి ప్రజల మద్దతు నిరంతరం ఉండాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు ఎం.రాజశేఖర్, రాధ, పద్మమ్మ, తులసి, ఎంపీటీసీ వనం మాధవి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మిట్ట వెంకట రంగారెడ్డి, కౌకుంట్ల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు చింతకింది నాగార్జునరెడ్డి, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట
శంకర్పల్లి : సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండలంలోని జనవాడ, మిర్జాగూడ గ్రామాల్లో ప్రభుత్వం మంజూరు చేసిన ఆసరా పింఛన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో లేని సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ తెలంగాణలో ప్రవేశపెడుతున్నారని తెలిపారు. అర్హులందరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ, సర్పంచ్‌లు రవీందర్‌గౌడ్, లలిత నర్సింహ, శ్రీనివాస్, ఎంపీటీసీ నాగేందర్, ఎంపీడీవో వెంకయ్య, నాయకుడు వెంకటేశ్ పాల్గొన్నారు.
భవిష్యత్‌లో ఉన్నతశిఖరాలను అధిరోహిస్తారు
మొయినాబాద్ : భవిష్యత్‌లో గురుకుల విద్యా సంస్థల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు ఉన్నత స్థానంలో నిలబడతారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురుకుల పాఠశాల/కళాశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం వారం రోజులపాటు నిర్వహించిన స్వచ్ఛ గురుకుల డ్రైవ్ కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. చిలుకూరు గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/కళాశాల, ఎతుబార్పల్లిలోని చేవెళ్ల సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల స్వచ్చ పాఠశాల, తోలుకట్టాలోని గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్లో నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పశ్చిమ ప్రాంతీయ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ శారద అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గురుకుల విద్యా సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం మరింత బలోపేతం చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నదని చెప్పారు.
చేవెళ్ల గురుకుల పాఠశాల/కళాశాల అద్దె భవనంలో కొనసాగుతుందని, శాశ్వత భవనం నిర్మాణం కోసం చేవెళ్లలో 20 ఎకరాల స్థలంను కేటాయించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, వైస్ ఎంపీపీ మమత, ఎతుబార్పల్లి సర్పంచ్ నవనీత, తోలుకట్టా సర్పంచ్ శ్రీనివాస్, చేవెళ్ల కళాశాల ప్రిన్సిపాల్ రమాదేవి, చిలుకూరు కళాశాల ప్రిన్సిపాల్ శౌరిరాజు, తోలుకట్టా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌శర్మ, వైస్ ప్రిన్సిపాల్ స్వాతి, మాజీ ఎంపీటీసీ రవీందర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు జయవంత్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.