మానవ మనుగడ కోసం హరితయజ్ఞానికి శ్రీకారం చుట్టిన తెలంగాణ సర్కారు… హరితహారం కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. జీవకోటికి జీవనాధారం చెట్లు.. నేటి మొక్క రేపటి తరాలకు భవిష్యత్తు కావాలని భావిస్తున్నది. హరిత తపస్వి సీఎం కేసీఆర్ లక్ష్యం నెరవేరేలా విరివిగా మొక్కలను నాటాలని సంకల్పిస్తున్నది. స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా వన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి పల్లె, పట్టణంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కలు నాటారు. ఊరూరా పచ్చని మొక్కలు నాటడంతో పండుగ వాతావరణం నెలకొన్నది.
– నమస్తే తెలంగాణ, నెట్వర్క్
తాండూరు, ఆగస్టు 21: వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ సర్కార్ సూచన మేర కు తాండూరు నియోజకవర్గంలో ఆదివారం ప్రజా ప్రతినిధులు, అధికారులు మొక్కలు నాటారు. మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో పాలక వర్గం సభ్యులు మొక్కలు నాటి జాతీయ స్ఫూర్తిని చాటారు. సర్పంచ్ కోటం నవనీత ఆధ్వర్యంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు జీవన్గి-బషీరాబాద్ రోడ్డు మార్గంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీడీవో రమేష్, గ్రామ పెద్దలు మాణిక్‌రెడ్డి, నర్సిరెడ్డి, మళ్లికార్జున్, నాగేశ్వర్రావు, బస్సప్ప, గోపాల్, తదితరులు పాల్గొన్నారు.
పరిగి టౌన్ : నాటిన మొక్కలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్‌కుమార్ అన్నారు. 75వ స్వతంత్ర వజ్రో త్సవాలలో భాగంగా ఆదివారం పరిగి మున్సిపల్ పరిధిలో రోడ్డుకి రువైపు లా, వెంచర్లలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు రవీంద్ర, వేముల కిరణ్, మీర్ తాహెర్ అలీ, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, జూనియర్ అసిస్టెంట్ సంపత్‌కుమార్ పంతులు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
దోమ: బొంపల్లి గ్రామ పంచాయితీలోని పీఏసీఎస్ గోదాం ఆవరణలో సర్పంచ్ నరేశ్‌తో కలిసి ఎంపీపీ అనసూయ మొక్కలు నాటారు. మండల కేంద్రంలోని కేజీబీవీ గురుకుల పాఠశాలలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్గౌడ్తో కలిసి సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు రాజిరెడ్డి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఊటుపల్లిలో సర్పంచ్ మామిళ్ల నర్సింహులు, దిర్సంపల్లిలో సర్పంచ్ శాంతారెడ్డి, అయినాపూర్‌లో సర్పంచ్ గార్లపల్లి మల్లేశ్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో బొంపల్లి ఉప సర్పంచ్ రఫీక్‌పాషా, ఎంపీటీసీ రాములు, ఎంపీవో సోమలింగం, ఏపీవో దస్తయ్య, గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ యాదయ్యగౌడ్, టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాఘవేందర్‌రెడ్డి, టీఆర్ ఎస్ నాయకులు, పంచా యతీ కార్యదర్శులు హరీశ్వర్‌రెడ్డి, లాలు, మొగులయ్య, ఆయా గ్రామాల వార్డు సభ్యులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.
కులకచర్ల: కులకచర్ల మండల పరిధిలోని పటేల్చెరువుతండాలో డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి సర్పంచ్ శాంతి తులసీరాంతో కలిసి మొక్క లు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందాస్ నాయ క్, లింగపంల్లి గ్రామ సర్పంచ్ శారదమ్మ, ఏపీవో వెంకటేశ్, శివకుమార్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. చౌడాపూర్ మండల కేంద్రంలోని గ్రామ సర్పంచ్ కొత్త రంగారెడ్డి, ఎంపీటీసీ శంకర్ ఆధ్వర్యంలో పాఠశాలలో, గ్రామ పంచాయతీ ఆవరణ లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి జడ్పీటీసీ రాందాస్ హాజరయ్యారు. మండల పరిధిలోని ముజాహిద్పూర్ గ్రామంలోని మోడల్ స్కూల్లో విద్యార్థు లతో కలిసి గ్రామ సర్పంచ్ లక్ష్మి మొక్కలు నాటారు.
కార్యక్రమంలో ఆంజనేయులు, నర్సింహులు, బాలకృష్ణ, వెంకటయ్య, రాములు, భాస్కర్, సోమలింగం, భీమ య్య, నర్సింలు, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. మండల పరిధిలోని పుట్టప హాడ్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వ హిం చా రు. కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ అంజిలమ్మ, కార్యదర్శి కవిత, గ్రామ స్తులు పాల్గొన్నారు.
కొడంగల్: వజ్రోత్సవ వేడుకలు నియోజకవర్గ పరిధిలోని కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్ మండలాల్లో ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం వన మహోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. మండలంలోని హస్నాబాద్ గ్రామంలో సర్పంచ్ పకీరప్ప, మండల కోఆప్షన్ సభ్యులు ముక్తార్. ఎంపీడీవో పాండు, ఏవీవో రాములుతో పాటు ప్రజా ప్రతిని ధులు, గ్రామస్థులు ఉత్సహంగా వనమహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కృష్ణవేణి, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు చంద్రప్రకాష్‌తో పాటు కృష్ణ, రాములు పాల్గొన్నారు. బొంరాస్‌పేటలో ఈర్లపల్లి సర్పంచ్ లక్ష్మీ బాయి, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు రాజునాయక్ గ్రామంలోని పల్లె ప్రకృ తివనంలో మొక్కలు నాటారు. రేగడిమైలారంలో సర్పంచ్ రాజేశ్వరి, ఎంపీటీసీ జగదీష్, ప్రజలు మొక్కలు నాటారు.
వికారాబాద్ : వికారాబాద్ పట్టణంలోని పలు వారుల్లో మొక్కలు నాటారు. మండల పరిధిలోని రహదారుల పక్కల అధికారులు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. వికారాబాద్, మర్పల్లి, మోమిన్‌పేట, బంట్వారం, ధారూరు, కోట్‌పల్లి, నవాబుపేట మండలాల్లో ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాలు, పార్కులు, రోడ్లకు ఇరువైపుల, ఖాళీ స్థలాల్లో, ఆలయాల వద్ద, ఇండ్ల ముం దు అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి మొక్కలు నాటి నీరు పోశారు. కార్యక్ర మంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీడీవోలు, అధ్యక్షులు, చైర్మన్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, నాయకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మోమిన్‌పేట: మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో డీపీవో మల్లా రెడ్డి, మండల అధికారులతో కలసి జడ్పీ సీఈవో జానకీరెడ్డి మొక్కలు నాటారు. అదేవిధంగా ఎంపీడీవో శైలజారెడ్డి, చక్రంపల్లి, చీమలధరి గ్రామాల్లో, చంద్రాయన్పల్లి గ్రామం లో సర్పంచ్ అంజయ్య, టేకులపల్లి పంచాయతీ కార్యదర్శి వెంకట య్య, తదితరల గ్రామాల్లో సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచులు అలివేలమ్మ, వసంత పంచాయతీ కార్యదర్శి మహిపాల్ రెడ్డి, ఎన్ఆర్ఈజీ ఎస్ సిబ్బంది పాల్గొన్నారు.