కొడంగల్, మే 31: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కొడంగల్‌ను దత్తత తీసుకొని ప్రత్యేకంగా కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేసి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళుతు న్నట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని రెడ్డి బసిరెడ్డి గార్డెన్లో ఈ నెల నాలుగో తేదీన కోస్గిలో కేటీఆర్ పర్యటనను పురస్కరించుకొని ఏర్పాట్ల పై కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్ మండలాల టీఆర్ఎస్ ముఖ్యనాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేటీఆర్ సభకు భారీగా తరలి రావాలని, ముఖ్యనాయకులు జన సమీకరణకు చర్యలు తీసుకోవాలని తెలి పారు. కొడంగల్ మండలాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడంతో పాటు అభి వృద్ధికి ప్రత్యేకంగా రూ. 25 కోట్లను మంత్రి కేటీఆర్ కేటాయించినట్లు తెలిపారు.
కాగా ఈనెల 13వ తేదీన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు కొడంగల్‌కు రానున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా 50 పడకల ప్రభుత్వ దవాఖాన, డిగ్రీ కళాశాల, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ భవనాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలాగే డయాలసిస్ సెంటర్‌ను ప్రారంభించనున్నారు. దవాఖానను సందర్శించిన ఎమ్మెల్యే డయాలసిస్ సెంటర్ ఏర్పాటపై రాష్ట్ర డయాలసిస్ అధికారి డా. శ్రీనివాస్‌తో మాట్లాడారు. ఈ కార్యక్ర మంలో ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్, మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్‌రెడ్డితో పాటు మూడు మండలాల ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
‘దళితబంధు’తో దళితుల్లో ఆనందం
దళితబంధు పథకం అమలుతో దళితుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నదని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దళిత బంధు పథకం కింద మంజూరు అయిన వాహనాలను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏండ్ల కాలంగా దళితులు అభివృద్ధికి నోచుకోలేక వెను బడి ఉన్నారని వారి అభ్యున్నతి గాను ముఖ్చమంత్రి దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి లబ్ధిదారుడికి రూ.10లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్, మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్‌రెడ్డి, కౌన్సిలర్ మధుసూదన్‌యాదవ్, టీఆర్ఎస్ నేతలు రమేష్‌బాబు, చాంద్‌పాషా పాల్గొన్నారు.