కొత్తూరు, మే 28: సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమంతో పట్టణాలు, మున్సిపాలిటీల్లో ఎక్కడ చూసినా పచ్చదనం సంతరించుకున్నది. అంతేకాకుండా ప్రభుత్వం అన్ని పట్టణాల్లో అర్బన్ పార్కులను ఏర్పాటు చేయడంతోపాటు బృహత్ పట్టణ ప్రకృతివనాలను కూడా నిర్మిస్తున్నది. దీంతో పట్టణవాసులు ఉదయం, సాయంత్రం సమయా ల్లో వాటిలో సేద తీరేందుకు అవకాశం ఏర్పడింది.
కొత్తూరులో రెండు పట్టణ ప్రకృతి పార్కులు
హైదరాబాద్‌కు కూత వేటు దూరంలో ఉన్న కొత్తూరు మున్సిపాలిటీ పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. ఇక్కడ అనేక పరిశ్రమలు వెలిశాయి. దాంతోపాటే కాలుష్యం కూడా పెరిగింది. దీంతో ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించేందుకు నడుంకట్టింది కొత్తూరు మున్సిపాలిటీ.
అయితే కొత్తూరులో ప్రభుత్వ స్థలానికి విపరీతమైన కొరత ఉన్నది. ఏ ప్రభుత్వ కార్యక్రమానికి కూడా స్థలాన్ని కేటాయించలేని పరిస్థితి నెలకొన్నది. దీం తో వెంచర్లలోని పదిశాతం భూమిలో ఈ పార్కు లను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన అధికారులకు వచ్చింది. దీంతో ఏడు పార్కుల ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పం పించగా.. రెండు పార్కులను నిర్మించుకునేందుకు అనుమతి రావడంతో అధికారులు ఆ పనులను ప్రారంభించారు. మున్సిపాలిటీలోని గుడ్‌విల్ వెం చర్లో ఒక పట్టణ ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశా రు. అందులో 1900వివిధ రకాలైన మొక్కలను నాటి ఏపుగా పెంచారు. దీంతోపాటు గోపాల్‌రెడ్డి వెంచర్‌లోనూ మరో అర్బన్ పార్కును ఏర్పాటు చేశారు. ఇందులో మొత్తం 4 వేల మొక్కలను నాటారు. అవి కూడా ఏపుగా పెరిగి అందమైన ఉద్యాన వనంలా తయారైంది.
పుర ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం
కొత్తూరు మున్సిపాలిటీ ప్రజలకు ఆహ్లాదకర వాతావారణాన్ని అందించేందుకు కృషి చేస్తున్నాం. అందు లో భాగంగానే పట్టణ ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా మున్సిపాలిటీలో ఐరన్ స్పాంజ్ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. వాటితో గాలి కాలుష్యం అవుతున్నది. అందువల్ల అర్బన్ పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. వాటి వల్ల స్థానికులకు స్వచ్ఛమైన గాలి లభిస్తుంది.
– లావణ్య, మున్సిపల్ చైర్పర్సన్, కొత్తూరు
మరో ఐదు అర్బన్ పార్కుల ఏర్పాటుకు కృషి
కొత్తూరు మున్సిపాలిటీలో ఇప్పటికే రెండు పట్టణ ప్రకృతి వనాలను ఏర్పాటు చేశాం. మరో ఐదు పా ర్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. కొత్తూరులో ప్రభుత్వం స్థలం కొరత ఉంది. అందువల్ల అర్బన్ పార్కుల ఏర్పాటు ఆలస్యమవుతున్నది. అందుకోసం వెంచర్లలో ఉన్న 10 శాతం భూమిని వినియోగించుకుంటున్నాం. మున్సిపాలిటీలో ఎక్కడైనా స్థలం చూపిస్తే అర్బన్ పార్కు ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాం.
– వీరేందర్, మున్సిపల్ చైర్మన్ కొత్తూరు