షాద్‌నగర్ టౌన్, నవంబర్ 14: జవహర్లాల్ నెహ్రూ జయంతిని ఆదివారం షాద్‌నగర్ గ్రేడ్-1 గ్రంథాలయం లో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని వినాయక గంజ్‌లోని గ్రంథాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మ న్ లక్ష్మీనర్సింహారెడ్డి, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డితో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ మొదటి ప్రధాని నెహ్రూకు పిల్లలంటే చాలా ఇష్టమని, ఆయన జయంతినే బాలల దినోత్సవంగా ప్రతి ఏడాది జరుపుకొంటున్నామని, ఆయన దేశానికి అందించిన సేవలు మరువలేమన్నారు. నవంబర్ 14ను పురస్కరించుకుని ప్రతి ఏడాది గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రంథాలయాలను పునఃప్రారంభించాలని కోరుతూ గ్రామీణ గ్రంథాలయ నిర్వాహకులు చైర్మన్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం పలువురు చిన్నారులకు నిఘంటువులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీనివాస్, గ్రంథాలయ అధికారి ప్రతాప్, వైస్ చైర్మన్లు మహేశ్వర్, సురేందర్, డైరెక్టర్లు, సభ్యులు నవీన్‌కుమార్, గోపాల్, సలీం, ఆంజనేయులు, యాదయ్య, శంకర్, జగన్, మహేందర్, సునీల్‌రెడ్డి పాల్గొన్నారు.
విద్యార్థులకు ఆటల పోటీలు
దేశ మొదటి ప్రధాని నెహ్రూ జయంతిని పురస్కరించుకుని మండలంలోని పలు ప్రైవేట్ పాఠశాలల్లో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలను నిర్వహించారు. భవిష్యత్తు బాలల చేతుల్లో నే ఉందని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయు లు, ఉపాధ్యాయులు పేర్కొన్నారు.
కస్తూర్బాగాంధీ బాలికల స్కూల్లో..
నేటి బాలలే నవ భారత నిర్మాతలని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ మధురవాణి అన్నారు. ఆదివారం నెహ్రూ జయంతిని పురస్కరించుకుని పాఠశాలలో ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో..
మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించా రు. ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధు లు పూలమాలలువేసి నివాళులర్పించా రు. ఈ సందర్భంగా కొందరు యువ కులు విద్యార్థులకు నోటు పుస్తకాలు, పలకలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ లలిత, జ్యోతయ్య, రవి, శ్రీశైలం, సురేశ్, పాండు, ప్రసాద్, దశరథ్, విద్యార్థులు పాల్గొన్నారు.
కడ్తాల్‌లో..
జవహర్లాల్ నెహ్రూ దేశానికి చేసిన సేవలను మరువలేనివని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సింహ ముదిరాజ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలువేసి నివాళులర్పించారు.