పెద్దేముల్, మే 20: పల్లెల రూపురేఖలు మారుస్తామని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు.శుక్రవారం మండల పరిధిలోని కందనెల్లి, ఖానాపూర్, రుక్మాపూర్, రేగొండి, కొండాపూర్,మదనంతాపూర్, మారేపల్లి తండా, దుగ్గాపూర్, చైత న్యనగర్ గ్రామాల్లో రూ.43 లక్షల వ్య యంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించడంతోపాటు, రుక్మా పూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి సీడీపీ, డీఎంఎఫ్టీ, ఎన్ఆర్ఈజీఎస్ తదితర నిధులను కేటాయించి మౌళిక సదుపాయాలను కల్పిస్తున్నామ న్నారు. రానున్న రెండు సంవత్సరాల్లో పెద్దేముల్ మం డలాన్ని జిల్లాలోనే ఆదర్శమండలంగా తీర్చిదిద్దుతామన్నారు.
కార్యక్రమాల్లో ఎంపీపీ అనురాధరమేశ్,వైస్ ఎంపీపీ మధులత, ఆయా గ్రామాల సర్పంచులు మోహన్ రెడ్డి,నర్సింహులు, శివలీల, హైదర్, చంద్రయ్య, గోవర్ధన్,పాండు, పాషా, లలిత, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కోహిర్ శ్రీనివాస్, పార్టీ నాయకులు రమేశ్, కొమ్ము గోపాల్‌రెడ్డి, నరేశ్‌రెడ్డి,శిబ్లి,గోపాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రాములు, డీవై ప్రసాద్, ఎంపీడీవో లక్ష్మ ప్ప, ఎంపీవో సుష్మ,ఆర్ఐ రాజురెడ్డి, పంచాయతీ కార్యదర్శు లు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అవ్వా ఎలా ఉన్నావ్ ?…ఆరోగ్యం బాగుందా ?
అవ్వా ఎలా ఉన్నావ్ ? ఆరోగ్యం బాగుందా ? ఊరు ఎలా ఉంది అని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మండల పరిధిలోని కందనెల్లి గ్రామంలో పలువురు వృద్ధ మహిళలను ఆప్యాయంగా పల కరించారు. శుక్రవారం కందనెల్లి గ్రామంలోని హనుమాన్ మందిరం సమీపంలో ముగ్గురు వృద్ధ మహిళలు అక్కడ కూ ర్చున్న విషయాన్ని గమ నించిన ఎమ్మె ల్యే అందులో ఉన్న భాగ్యమ్మ అనే అవ్వను ఆప్యాయంగా పలకరిస్తూ …అవ్వా ఎలా ఉన్నావ్? నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఊరు బాగుందా? అని అడిగారు. వెంటనే ఆ అవ్వా ఊరు బాగుంది బిడ్డా..కానీ నాకు ఇల్లు లేదు అని చెప్పింది. అందుకు స్పందించిన ఎమ్మె ల్యే తెలంగాణ ప్రభుత్వం కట్టించే ఇండ్లలో మొదటి ఇల్లు నీకే ఇస్తా అని ఆ అవ్వకు మాట ఇచ్చారు.అందుకు ఆమె సంతో షంతో చల్లగా ఉండు బిడ్డా అని ఎమ్మెల్యేను ఆశీర్వదిస్తూ నమస్కరించింది.
చేపల పెంపకానికి ప్రభుత్వం చేయూత
కోట్‌పల్లి, మే 20: మత్స్యుశాఖ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తున్నదని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. కోట్‌పల్లి మత్స్యుశాఖ పెండింగ్ పనుల్లో భాగంగా షెడ్ నిర్మాణ పనులకు సంబంధించిన ప్రొసీడింగ్‌ను మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో కోట్‌పల్లి అధ్యక్షుడు ఆనంద్‌కు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే అందించారు. కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు, మం డల మత్స్యశాఖ అధ్యక్షుడు రావిరాల ఆనంద్, సభ్యులు మొగులయ్య, బిచ్చప్ప, సాయిబ్రాం, సత్యనారాయణ, చంద్ర ప్ప, మక్భుల్ తదితరులు ఉన్నారు.