పెద్దేముల్, మే 16 : ఇండ్ల పరిసరాల్లో దోమలు వృద్ధి చెందకుండా తగు జాగ్రత్తలు పాటించాలని ఎంపీహెచ్ఏ హరిశంకర్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో వైద్య సిబ్బందితో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ మురుగు నీరు, వర్షపు నీరు, టైర్లలో నీరు, గుంతల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉండడంతో అందులో దోమలు వృద్ధి చెంది డెంగీ, మలేరియా తదితర అంటువ్యాధులు వస్తాయన్నారు.కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నిషిత, హెల్త్ సూపర్ వైజర్ పుష్పలత, ఎంపీహెచ్ఈవో రాజు, ఏఎన్ఎంలు సుజాత, పీహెచ్సీ విజయ, ఆశవర్కర్లు అనూష, మల్లీశ్వరి పాల్గొన్నారు.
కోట్పల్లిలో..
కోట్పల్లి, మే 16: వైద్య శాఖ సిబ్బంది ఇంటింటికీ ర్యాలీతో తిరుగుతూ.. దోమల నివా రణపై చర్యలు, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. దోమలు ఎక్కువగా ఉంటే డెంగీ వ్యాధి వస్తుందని దోమలు లేకుండా చూసుకోవాలని సూచించారు. పూల కుండీలు, పాత టైర్లు, ఎయిర్ కూలర్లు, ఖాళీ డబ్బాలు, నిల్వ ఉన్న మురుగు నీరు ఉంటే దోమలు ఉండే అవకాశం ఉంటుందని, ఇంటి చుట్టురా పరిశుభ్రత పాటించాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కోట్పల్లి ఆరోగ్య శాఖ సూపర్ వైజర్ శాంతకుమారి, ఎఎన్ఎంలు పాల్గొన్నారు.
పరిశుభ్రతను పాటిద్దాం
బంట్వారం, మే 16: వైద్య శాఖ సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ దోమల నివారణపై చర్యలు, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటిం చి, దోమలు రాకుండా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ రోహిత్, ఆరోగ్య శాఖ సూపర్ వైజర్ ఐల య్య, ఫార్మాసిస్టు అమరేందర్ కుమార్, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.