షాద్‌నగర్ రూరల్, మే 16: విత్తన డీలర్లు ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన నాణ్యమైన విత్తనాలనే విక్రయించాలని వ్యవసాయశాఖ జిల్లా అధికారి గీతారెడ్డి సూచించారు. ఫరూఖ్‌నగర్ మండలం ఎలికట్ట గ్రామంలోని రైతువేదికలో సోమవారం వ్యవసాయ, పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో నకిలీ విత్తనాల నియంత్రణ కు తీసుకోవాల్సిన చర్యలపై విత్తన డీలర్లకు జరిగిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నదని, రైతులు నష్టపోకుండా కఠినంగా చర్యలు తీసుకుంటున్నదన్నారు. పోలీస్ శాఖ, ఎస్వోటీ సహకారంతో నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు. డీలర్లు లైసెన్స్‌లు కలిగి ఉండాలని, అదే విధంగా నాణ్యమైన విత్తనాలనే రైతులకు విక్రయిం చాలన్నారు. 1986 చట్టం ప్రకారం నాసిరకం విత్తనాలతో నష్టపోయిన రైతులకు పరిహారాన్ని ఇప్పిస్తామని తెలిపారు.
నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై పీడీయాక్ట్
నకిలీ విత్తనాలను తయారు చేసిన, విక్రయించిన, రైతులను మోసగించిన వారిపై పీడీయాక్ట్ కేసులు నమోదు చేస్తామని షాద్‌నగర్ ఏసీపీ కుషాల్కర్ హెచ్చరించారు. ఇప్పటికే డివిజన్లో ఐదుగురిపై పీడీయాక్ట్ కేసులు నమోదైనట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంత రైతు లు నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎస్వోటీ సహకారంతో నకిలీ విత్తనాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఇటీవల షాద్‌నగర్ టోల్‌ప్లాజా వద్ద నకిలీ విత్తనాలను తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ ఏడీ రాజారత్నం, గ్రామ సర్పంచ్ సాయిప్రసాద్, ఎంపీటీసీ శ్రీశైలం, సంజీవయ్య, ఏవోలు నిశాంత్‌కుమార్, శిరీష, గోపాల్, మధుసూదన్, సీఐలు నవీన్‌కుమార్, సత్యనారాయణ, బాలరాజ్ పాల్గొన్నారు.
పచ్చి రొట్ట ఎరువులతో భూమి సారవంతం
షాద్‌నగర్ టౌన్, మే 16: పచ్చి రొట్ట ఎరువులతో భూమి సారవంతమవుతుందని వ్యవసాయశాఖ జిల్లా అధికారి గీతారెడ్డి, ఏడీ రాజారత్నం, షాద్‌నగర్ పీఏసీఎస్ చైర్మన్ బక్కన యాదవ్ అన్నారు. షాద్నగ ర్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లో సోమవారం పచ్చి రొట్ట ఎరువుల(జనుము, జినుగు)విత్తనాల సబ్సిడీ కేంద్రాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. పంటలు సాగు చేసే నెల రోజుల ముం దు ఈ పచ్చి రొట్ట ఎరువుల విత్తనాలను భూమిలో వేయడం ద్వారా భూమి సారవంతంగా మారుతుందన్నారు. తద్వారా దిగుబడి కూడా పెరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఈ విత్తనాలను 65 శాతం సబ్సిడీకి అందిస్తున్నదన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి నిశాంత్ కుమార్, ఏఈవో నిఖిల్, పీఏసీఎస్ సంఘం సీఈవో రఘునందన్ పాల్గొన్నారు.