కేశంపేట, మే 12 : అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందజేయాలని రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రతీక్‌జైన్ సూచించారు. కేశంపేట మండలంలోని పాపిరెడ్డిగూడ, బొదునంపల్లి, చౌలపల్లి గ్రామాల్లో గురువారం ఆయన అధికారులతో కలిసి అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. అక్కడ విద్యార్థులకు అందజేస్తున్న భోజనాన్ని పరిశీలించారు. చిన్నారులకు పోషకాలతో కూడిన ఆహారాన్ని అందజేసి, రక్తహీనత ఉన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో రికార్డులు, విద్యార్థుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాల పనితీరుపై జాయింట్ కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ విశాల, ఆయా గ్రామాల సర్పంచ్‌లు విష్ణువర్ధన్‌రెడ్డి, కళమ్మ, ఐసీడీఎస్ పీడీ మోతి, సీడీపీవో నాగమణి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ
షాద్‌నగర్ : ఫరూఖ్‌నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్రామంలో గురువారం అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ తనిఖీ చేశారు. చిన్నారులకు, కిషోర బాలికలకు అందిస్తున్న పోషక ఆహారాలపై ఆరా తీశారు. ప్రతి నెల గర్భిణులు, బాలింతలకు పాలు, గుడ్లు సక్రమంగా అందుతున్నాయా? అని ఆరా తీశారు. ప్రభుత్వం సరఫరా చేసే ప్రతి ఆహారాన్ని లబ్ధిదారులకు సక్రమంగా అందించాలని సూచించారు. చిన్నారులకు బోధిస్తున్న పాఠాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ మోతీ, కేశంపేట జడ్పీటీసీ విశాల, ఎంపీడీవో కల్యాణి, సీడీపీవో నాగమణి, సర్పంచ్ మాధవి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.