ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 30 : పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన నేపథ్యంలో సెలవు రోజుల్లో పిల్లలకు విజ్ఞానంతోపాటు వినోదాన్ని అందించడం ద్వారా వారి అభిరుచి ని మెరుగుపర్చేందుకు తల్లిదండ్రులు కృషి చేయాలి. ప్రస్తుతమున్న పోటీ ప్రపంచంలో పిల్లల్ని వినోదాల ద్వారా కాలక్షేపం కోసం వదిలేయకుండా వారిలోని నైపుణ్యాన్ని మెరుగుపర్చే శిక్షణ ఇప్పించాలి. పెద్ద పిల్లలైతే వారు చదివే కోర్సుకు ఉపయోగపడే అదనపు స్కిల్స్ నేర్పించే సంస్థలకు పంపించాలి. క్రీడలతోపాటు అనేక రకాలుగా మన జీవితంలో ఉపయోగపడే విషయాలను పిల్లలు నేర్చుకునేలా చూడాలి. ఆధునిక సమాజంలో విద్యతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతో అవసరం. చాలా మంది యువకులు ఈ నైపుణ్యం లేక వెనుకబడి పోతున్నారు. దేశంలో ని ఓ ప్రముఖ సంస్థ ఈ అంశా ల్లో అధ్యయనం చేసి నివేదిక ఇచ్చింది. దాని ప్రకారం దేశంలో కేవలం 19 శాతం యువకులు మాత్రమే కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉన్నారని తెలిపింది. వీటిని నేర్చుకోవడం ద్వారా భవిష్యత్తులో ఉద్యోగా లను సాధించేందుకు దోహదప డుతుంది.
చేతిరాత మెరుగుతో మార్కులు..
పరీక్షల్లో చేతిరాత చాలా ముఖ్యం. ఏ పరీక్ష అయినా మీరే రాసే సమాధానాలను మంచి చేతిరాతతో రాస్తే చదివేందుకు బాగుంటుంది. దీంతో ఆయా పరీక్షల్లో మంచి మార్కులు వచ్చే అవకాశముంది. పాఠశాలల్లో చేతిరాత బాగాలేక టీచర్లతో చీవాట్లు తిన్న వారంతా ఈ సెలవుల్లో చేతిరాత మెరుగుపరిచే శిక్షణా తరగతులకు వెళ్లడం మంచిది. వీటికి డీవీడీలు, పుస్తకాలు కూడా మార్కెట్లో లభిస్తాయి.
భాషపై పట్టుతో భవితకు నాంది..: భాషపై పట్టు అవసరం. అది తెలుగు/ఇంగ్లిష్ ఏదైనా కావొచ్చు. భాషపై పట్టులేకపోతే కమ్యూనికేషన్ కూడా దెబ్బతింటుంది. కాబట్టి వేసవి సెలవుల్లో భాషపై దృష్టి పెడితే అది జీవిత కాలమంతా మనల్ని కాపాడుతుంది.
కంప్యూటర్ టెక్నాలజీని నేర్చుకోవాలి…: నేటి ఆధునిక యుగంలో టెక్నాలజీ వినియోగం లేనిదే ఏ పని జరుగడంలేదు. నేడు కంప్యూటర్ టెక్నాలజీ ప్రతి వ్యక్తికి ప్రాథమిక అవసరం. రానున్న రోజుల్లో ఉద్యోగ పరీక్షలన్నీ ఆన్లైన్లోనే జరిగే అవకాశం ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ కంప్యూటర్ టెక్నాలజీని నేర్చుకోవాలి పుస్తకాలు చదువాలి…: సెలవుల్లో రోజుకి గంట సమయాన్ని పుస్తక పఠనానికి కేటాయిస్తే ఎంతో విజ్ఞానం పెరుగుతుంది. ఈ విషయంలో తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలి.
ఆటలు, వ్యాయామం తప్పనిసరి..: వ్యాయామం, ఆటలు ఫిజికల్‌గా, ఫిట్‌గా ఉంచుతాయి. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుతాయి.స్విమ్మింగ్ నేర్చుకోవాలి…: స్విమ్మింగ్ ఎంతో ముఖ్యమైనది. స్విమ్మింగ్ కోసం ప్రత్యేకించి సమయం లేకపోవటంతో ఎక్కువ మంది ఈతకు దూరమవుతున్నారు. వేసవి సెలవుల్లో దగ్గరలో ఉన్న స్విమ్మింగ్‌పూల్స్‌కు వెళ్లి ఈత నేర్చుకోవటం ఎంతో అవసరం.
సెలవులను వృథా చేయొద్దు..
సెలవుల్లో సమయాన్ని వృథా చేయకుం డా వ్యాయామం, విద్య, వినోదం లాం టివాటిపై విద్యార్థులు దృష్టి సారించేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పాఠశాలలకు వెళ్లినప్పుడే చదువుకోవాలనేది కాకుండా సెలవు రోజుల్లోనూ వా రికి చేదోడువాదోడుగా ఉంటూ వారు జీవితంలో సాధించాల్సిన వాటిపై దృష్టి సారించేందుకు కృషి చేయాలి.
–పరమేశ్, ఉపాధ్యాయుడు