పరిగి, ఏప్రిల్ 30: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ లో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, ప్రతిపక్షాలు చేసే ప్రతి విమర్శనూ ఎక్కడికక్కడే తిప్పికొట్టాలని టీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ పార్టీ కార్యకర్తలకు సూచించారు. టీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉండాలని పేర్కొన్నారు. శని వారం పరిగిలోని బృందావన్‌గార్డెన్స్‌లో నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆనంద్ మాట్లా డుతూ ప్రతి పక్షాలకు బలం లేదని, వారిదంతా సోషల్ మీడియాలో గందరగోళం సృష్టించడం తప్ప మరొకటి కాదన్నారు. ప్రతిపక్షాలు కావాలనే బట్ట కాల్చి మీద పడేస్తు న్నాయని, వాటికి ధీటుగా సమాధానం ఇవ్వడం ద్వారా టీఆర్ఎస్ సత్తా ఏమిటో చూపించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారన్నారు.
పార్టీ, సీఎం, ఎమ్మెల్యేలపై ఎవరూ విమర్శలు చేసినా పార్టీ కార్యకర్తలు ఊరు కోరాదన్నారు. పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నా ఏమి చేశా రని అడిగిన వారికి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకా లు, వారు పొందిన లబ్ధిని గుర్తు చేయాలన్నారు. స్థానిక సం స్థల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని తెలిపారు. పార్టీ సమావేశాలకు మహిళా ప్రజా ప్రతినిధులు సైతం హాజరుకావాలని ఆయన సూచించారు. సంక్షేమ పథకాల అమలులో ప్రజా ప్రతినిధుల పాత్రను పెంచాలని పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌కు సూచించారని, తద్వారా దళితబంధు, ఖాళీ స్థల ముంటే ఇంటి నిర్మాణానికి రూ.3లక్షలు ఇచ్చే పథకాలలో లబ్ధి దారుల ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేలకు ఇచ్చారన్నారు.
త్వరలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి
సీఎం కేసీఆర్ చేతులమీదుగానే పాలమూర్-రంగారెడ్డి ఎత్తి పోతల పథకం పూర్తవు తుందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా ఎలా నీరు తీసుకువస్తే జిల్లాకు వస్తాయనే అంశంపై సీఎం కేసీఆర్ జిల్లాకు చెందిన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలతో పలుమార్లు సమావేశమై చర్చించారన్నారు. పాలమూరు ఎత్తిపోతలతో జిల్లా సస్యశ్యామలంగా మారుతుందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మరోసారి వందశాతం అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్లో ఎమ్మెల్యే కేంద్ర బిందువుగా కార్యక్రమాలు కొనసాగుతుం టాయని, పార్టీ నాయకులు, ప్రజల మేలు కోసం కృషి చేసే మహేశ్‌రెడ్డి కంటే మంచి ఎమ్మెల్యే దొరకరని కితాబునిచ్చారు. ఎమ్మెల్యేను మరింత మంచి మెజారిటీతో గెలిపించు కోవాలని, అందుకుగాను మరింత కష్టపడి పనిచేయాలన్నారు.
తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్: మహేశ్‌రెడ్డి
పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ 60లక్షల మంది కార్యకర్తలతో దేశంలోనే ఒక తిరుగులేని శక్తిగా టీ ఆర్ఎస్ ఉందని, ఉద్యమ పార్టీగా ప్రస్థానాన్ని ప్రారంభించి తెలంగాణ ప్రజల ఇంటిపార్టీగా మారిందన్నారు. ఎదుటి పార్టీ వారు ఏమి మాట్లాడినా ఆయా గ్రామాల్లో సీఎం కేసీ ఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ పథకాలు తెలియజేసి ప్రతిపక్షాల నోరు మూయించాలని కార్యకర్తలకు సూచించారు. టీఆర్ఎస్ పార్టీ మరో వందేళ్లు ఉండా లనే దూర దృష్టితో పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. పరిగి నియో జకవర్గం లో గత నాలుగు దశాబ్దాలుగా తమ కుటుంబంతో కలిసి కార్యకర్తలు పని చేస్తున్నారని చెప్పారు. పార్టీకి విధేయులుగా పనిచేసిన వారిని పార్టీ తప్పనిసరిగా గుర్తిస్తుందన్నారు.
మరింత సమన్వయం పెరుగుతుంది : బుయ్యని
డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ కార్యకర్తల సమావేశాలు నిర్వహించడం ద్వారా మరింత సమన్వయం పెరుగుతుందని చెప్పారు. 14 సంవ త్స రాల ఉద్యమ సమయంలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆనాడు గుర్తించిన ప్రజల బాధలు తీర్చే విధంగా నేడు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలోనూ పరిగి ప్రాంతంలో ఉవ్వెత్తున ఉద్యమం కొనసాగిందని చెప్పా రు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడిగా నియమింపబడిన తర్వాత మొదటిసారి పరిగికి వచ్చిన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్‌ను ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి సన్మా నిం చారు. అంతకుముందు ఆయనకు ఘన స్వాగతం పలికారు
కార్యక్రమంలో జడ్పీటీసీలు కొప్పుల నాగారెడ్డి, బి. హరిప్రియ, మలిపెద్ది మేఘమాల, రాందాస్, శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీలు కె.అరవిందరావు, మల్లేశం, అనుసూజ, సత్యమ్మ, సీనియర్ నాయకులు కొప్పుల అనిల్‌రెడ్డి, పరిగి, కులకచర్ల మార్కెట్ చైర్మన్లు ఎ.సురేం దర్, హరికృష్ణ, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్‌రెడ్డి, పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మండలాల పార్టీ అధ్యక్షులు ఆర్.ఆంజనేయులు, మహిపా ల్‌రెడ్డి, శేరి రాంరెడ్డి, సత్తినేని సుధాకర్‌రెడ్డి, గోపాల్, మండలాల రైతుబంధు సమితి అధ్యక్షులు మేడిద రాజేందర్, బి.లక్ష్మయ్య, పీరంపల్లి రాజు, మర్పల్లి మార్కెట్ చైర్మన్ శ్రీకాంత్‌గౌడ్, వికారాబాద్ నియోజకవర్గ నాయకులు కమాల్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, రాములు యాదవ్, వెంకట్, వేణుగోపాల్‌రెడ్డి, చిగుళ్లపల్లి రమేశ్, చంద్రశేఖర్‌రెడ్డి, రాజు నాయక్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.