
పెద్దేముల్, జులై 21: అడవుల శాతాన్ని పెంచడానికి, పర్యావరణాన్ని కాపాడడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది ఎన్నో సత్ఫలితాలిస్తున్నది. గ్రామానికో వన నర్సరీని ఏర్పాటు చేసి అందులో రకరకాల మొక్కలు పెంచుతున్నారు. ప్రతి ఏటా వర్షాకాలంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపడుతున్నారు. అందులో భాగంగా పెద్దేముల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు పెరిగి పెద్దవమయ్యాయి. దీంతో ఈ పీహెచ్సీ పచ్చని చెట్లతో ఉద్యానవనంగా కనిపిస్తూ, ఆహ్లాదాన్ని పంచుతున్నది.
2 వేల మొక్కలు నాటారు..
హరితహారంలో భాగంగా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సుమారు 2 వేల మొక్కలు నాటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటించాలని అప్పటి కలెక్టర్ అయేషా మస్రత్ ఖానమ్ ఉపాధి హామీ కూలీలతో సుమారు 2 వేల మొక్కలు నాటించారు. అనంతరం వాటిని సంరక్షించాల్సిన పూర్తి బాధ్యత వైద్య సిబ్బందిదేనని ఆదేశించారు. దీంతో వైద్య సిబ్బంది, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రావణ్ కుమార్‌రెడ్డి హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్‌తో బోరుబావి బాగు చేయించి, మొక్కలకు రోజూ నీటిని అందించి, సంరక్షించారు. ఆ మొక్కలు నేడు పచ్చని చెట్లుగా మారి ఆసుపత్రికి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
నందనవనంలా పీహెచ్సీ
పెద్దేముల్ పీహెచ్సీ పచ్చని చెట్లతో నందనవనాన్ని తలపిస్తున్నది. పచ్చని చెట్లతో చల్లని నీడ, స్వచ్ఛమైన ప్రాణవాయువునిస్తూ దవాఖానకు వచ్చే రోగులు, వారి బంధువులకు ఈ మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతున్నవి. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తాండూరు -సంగారెడ్డి ప్రధాన రోడ్డు పక్కనే ఉండడంతో చెట్లు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
ప్రతి మొక్కను బతికించేందుకు కృషి చేశాం
హారితహారంలో భాగంగా ప్రా థమిక ఆరోగ్య కేంద్రంలో అప్ప టి కలెక్టర్ అయేషా మస్రత్ ఖానమ్ ఆదేశాల మేరకు సు మారు 2 వేల మొక్కలు నా టాం. నాటిన ప్రతి మొక్కను బతికించేందుకు ప్రయత్నిం చాం. అందులో భాగంగా మొక్కల సంరక్షణకు ఒక మనిషిని పెట్టి, రోజు క్రమం తప్పకుండా నీళ్లు పోయించి, సంరక్షించాం. పచ్చని మొక్కలతో ఆరోగ్య కేంద్రం పార్కును తలపించేలా ఉంది.