పెద్దఅంబర్‌పేట, డిసెంబర్ 11: వెదురుతో తయారు చేసిన వస్తువులు ఆకట్టుకుంటున్నాయి. మున్సిపాలిటీలోని విజయవాడ జాతీయ రహదారి పక్కన పలువురు వెదురుతో బుట్టలను తయారు చేసి విక్రయిస్తున్నారు. నెత్తికి పెట్టుకునే టోపీలు, లేటెస్ట్ ట్రెండ్‌కు తగ్గట్టుగా వివిధ ఆకారాల్లో వెదురు గంపలు,
ఇంట్లో అలంకరణకు ఉపయోగించే వస్తువులను తయారు చేసి విక్రయిస్తున్నారు. వీటికి మంచి గిరాకీ ఉందని చెబుతున్నారు. కొన్నింటికి వెదురు వాడుతుండగా.. మరికొన్నింటికి వైరింగ్తో ఫినిషింగ్ ఇస్తున్నారు. ఒక్కో అలంకరణ వెదురు వస్తువు ధర రూ.2 వేలు నుంచి రూ.6 వేల వరకు ఉంటుందన్నారు.