కొందుర్గు, మార్చి 19: సీఎం కేసీఆర్ ప్రభుత్వం అడవుల సంరక్షణకు పెద్దపీట వేసింది. అడవుల్లోని చెట్లను నరికితే కేసులను నమోదు చేస్తున్నది. ఓ పక్క మొక్కలను నాటడం, మరో పక్క అడవులను కాపాడటం ద్వారా రాబోవు రోజుల్లో మానవ మనుగడకు ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం భా విస్తున్నది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని అడవులను పూర్తి స్థాయిలో సంరక్షించాలని, ప్రత్యే క నిఘా ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలను జారీ చేసింది.
నియోజకర్గంలోనే పెద్ద అడవి..
జిల్లేడుచౌదరిగూడ మండలంలోని పెద్ద ఎల్కిచర్ల గ్రామ శివారులోని అడవి షాద్నగర్ నియోజకవర్గంలోనే అతి పెద్దది. సర్వేనంబర్ 867, 867/7లలో 665 ఎకరాల్లో విస్తరించి ఉన్నది. దాని సరిహద్దులు పెద్ద ఎల్కిచర్ల, గాలిగూడ, వీరపురం, సాకలిపల్లితండా, వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలోని లింగంపల్లితండా, ముజాహిద్పూర్ గ్రామాలు ఉన్నాయి. ఈ అడవి సంరక్షణకు బీట్ ఆఫీసర్, నలుగురు వాచర్లు ఉన్నట్లు అటవీశా ఖ అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జంతువుల కోసం నీటి వసతి, సరిహద్దుల ను ఆక్రమించకుండా, చెట్లను నరికే వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
హరితహారంలో భాగంగా..
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం లో భాగంగా పెద్ద ఎల్కిచర్ల అడవిలో ప్రతి ఏడాది మొక్కలను నాటుతున్నారు. గతేడాది 65 వేల మొ క్కలను నాటినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ ఏడాది జూన్లో హరితహారంలో భాగం గా నాటేందుకు గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీలో లక్షా25 వేల మొక్కలను పెంచుతున్నారు. వాటిని గ్రామంలోని ఇండ్ల ఎదుట, పొలాల్లో నాటేందుకు రైతులకు, రోడ్డుకు ఇరువైపులా, అడవిలో నాటేందుకు సరఫరా చేయనున్నారు.
చెట్లు నరికితే కేసులు
పెద్ద ఎల్కిచర్ల గ్రామ శివారులోని అడవిలో ఎవరైనా చెట్లను నరికితే కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అడవిలో ఎక్కువగా టేకు, కానుగ, నీలగిరి, వేప తదితర రకాల చెట్లు ఉన్నాయి. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలకులు అడవుల సంరక్షణపై దృష్టి సారించకపోవడం తో అవి అంతరించిపోయే పరిస్థితికి చేరాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుం చి మొక్కల పెంపకం, అడవుల సంరక్షణపై దృష్టి పెట్టడంతో అడవులకు మళ్లీ పూర్వవైభవం వస్తున్నదని ప్రజలు పేర్కొంటున్నారు.
అటవీ సంరక్షణకు కృషి
పెద్ద ఎల్కిచర్ల గ్రామ శివారులోని అడవి సంరక్షణకు కృషి చేస్తున్నా. అడవి స్థలాన్ని ఆక్రమించకుండా, చెట్లను ఇతరులు నరుకకుండా చర్యలు తీసుకుంటున్నా. వచ్చే వర్షాకాలంలో అడవి లో మరిన్ని మొక్కలు నాటేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నా.
– అజీజ్, పెద్ద ఎల్కిచర్ల అటవీ బీట్ ఆఫీసర్
పూర్వవైభవం వస్తున్నది
టీఆర్ఎస్ ప్రభుత్వంలో అడవులకు పూర్వవైభవం వస్తున్నది. గతంలోని ఉమ్మడి ప్రభుత్వాల పాలకులు అడవుల సంరక్షణకు కృషి చేయలేదు. దీంతో అవి అంతరించిపోయే పరిస్థితికి చేరాయి. అలాగే ప్రతి ఏడాది హరితహారంలో భాగంగా మొక్కలు నాటుతుండటంతో ఏపుగా పెరిగి అడవి ప్రాంతం పచ్చదనాన్ని సంతరించుకున్నది.
– మొగులయ్య, గాలిగూడ గ్రామస్తుడు