శంకర్పల్లి, మార్చి 19: శంకర్పల్లి మండల మోకిల గ్రామ శివారులోని సర్వే నంబర్ 96, 197లలో గల భూముల్లో ఎవరైతే కాస్తులో ఉన్నారో వారికి పట్టాలు ఇప్పించేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శనివారం మోకిల శివారులో ఆ గ్రామ రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోకిల భూముల విషయంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించానని తెలిపారు. అంతకు ముందు ఆ గ్రామ మాజీ సర్పంచ్ ఆనంద్, శంకర్పల్లి ఏఎంసీ మాజీ చైర్మన్ రాజూనాయక్ మాట్లాడుతూ తమ తాతల కాలం నుంచి సుమారు 550 ఎకరాలలో భూమిని సాగు చేస్తున్నామని చెప్పారు. తమ భూములు తమకే చెందేలా ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలని కోరారు. అప్పటి వరకు ఈ భూముల్లో సర్వే నిలిపి వేయాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ సుమిత్ర, ఎంపీటీసీ సరిత, మోకిల పీఏసీఎస్ చైర్మన్ వేణుగోపాల్, మాజీ సర్పంచ్‌లు అడివయ్య, ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, గుడిమల్కాపూర్ ఏఎంసీ మాజీ చైర్మన్ డీ.వెంకట్‌రెడ్డి, నాయకులు లింగం, గోవర్ధన్‌రెడ్డి, సాత ప్రవీణ్‌కుమార్, ఖాదర్ పాషా, గోపాల్, వాసుదేవ్‌కన్నా, రైతులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ పేదల పెన్నిధి
సీఎం కేసీఆర్ పేదల పెన్నిధి అని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శనివారం మండల పరిషత్ సమావేశ మందిరంలో 43 మంది మహిళలకు కల్యాణ లక్ష్మి చెక్కులు, 10 మందికి సీఎం సహాయ నిధి చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకాలను ముఖ్య మంత్రులు ప్రవేశ పెట్టలేదని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ, మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మి, మండల, మున్సిపల్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కే.గోపాల్, వీ.వాసుదేవ్‌కన్నా, ఏఎంసీ చైర్మన్ బుచ్చిరెడ్డి, వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ సాత ప్రవీణ్‌కుమార్, కౌన్సిలర్లు చంద్రమౌళి, జే.శ్వేత, నాయుకలు పార్శి బాల కృష్ణ, తహసీల్దార్ సైదులు, ఎంపీడీవో వెంకయ్య పాల్గొన్నారు.