అబ్దుల్లాపూర్మెట్ : మానసిక వికలాంగులు, అనాథలకు సేవలందిస్తున్న ఆలేటి వరల్డ్ ఆశ్రమానికి అండగా ఉంటామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. అబ్దుల్లాపూర్మెట్ మండలం లష్కర్గూడలోని ఆలేటి వరల్డ్ ఆశ్రమాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాగ్యనగరాన భిక్షం అడిగే అభాగ్యులు లేని మహానగర ఆవిర్భావానికి 23 ఏండ్రుగా అహర్నిశలు శ్రమిస్తూ దేశ వ్యాప్తి సేవా సత్వర ఉద్యమాలతో విశ్వజగతిన స్వచ్ఛంద సంస్థలకు ఊపునిచ్చిన చరిత్రక సంస్థ ఆలేటి వరల్డ్ స్వచ్ఛంద సేవాసంస్థ అన్నారు. సంస్థ సేవలను కొనియడుతూ డాక్టర్ ఆలేటి ఆటంను మందకృష్ణ మాదిగ శాలువాతో సన్మానించి అభినందించారు.
అనంతరం లష్కర్గూడ ఉపసర్పంచ్ అల్లె యాదయ్యయాదవ్ అనాధలకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో వర్దమాన సినీ నటులు వినయ్, అంకెపాక హేలిశ్రీవినయ్, వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయనాయకులు సుభాశ్ చంద్రబోస్, సునీల్, మంగమ్మ, దుడ్డు ప్రభాకర్, రాంబాబుగౌడ్, నాయుడు, ఆశ్రమ నిర్వహకులు ఉన్నారు.