కొత్తూరు రూరల్ : సంత్శ్రీ సేవాలాల్ మహారాజ్ కారణజన్ముడని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మండల పరిధిలోని ఏనుగులమడుగుతండా గ్రామ పంచాయతీ పరిధిలోని పుల్చర్లకుంట తండాలో గిరిజన నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన సంత్శ్రీ సేవాలాల్, జగదంబ అమ్మవారి విగ్రహా ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధికి ఎంతో కృషి చేసాడని, గిరిజనుల ఆరాధ్యదైవంగా మారడన్నారు.
నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో విరాజిల్లాలని ప్రత్యేక పూజలను నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ అరుణ, ఎంపీటీసీ డాకీ, నాయకులు రమేశ్, రాంచందర్, గిరిజన నాయకులు పాల్గొన్నారు.