‘ముల్లంగి’తో ఆరోగ్యానికి మేలు
చలికాలంలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక రకాల కూరగాయలు ఉంటాయి. చలికాలంలో లభించే ముల్లంగిలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయని, బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి అనేక వ్యాధులకు దివ్య ఔషధంగా ముల్లంగి పని చేస్తుందని ఆయుష్ ప్రభుత్వ వైద్యాధికారి శ్రీనివాస్ వెల్లడించారు
- బీపీ, షుగర్, క్యాన్సర్ వ్యాధులకు దివ్య ఔషధం
- ఆయుష్ ప్రభుత్వ వైద్యాధికారి శ్రీనివాస్ వెల్లడి
మేడ్చల్, డిసెంబర్ 18(నమస్తే తెలంగాణ): చలికాలంలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక రకాల కూరగాయలు ఉంటాయి. చలికాలంలో లభించే ముల్లంగిలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయని, బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి అనేక వ్యాధులకు దివ్య ఔషధంగా ముల్లంగి పని చేస్తుందని ఆయుష్ ప్రభుత్వ వైద్యాధికారి శ్రీనివాస్ వెల్లడించారు. ముల్లంగిని ఆహారంలో చేర్చుకోవడం మూలంగా జరిగే ఆరోగ్య లాభాలను వైద్యాధికారి వివరించారు. ముల్లంగిలో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉండటం వలన ముల్లంగిని తీసుకున్నట్లయితే క్యాన్సర్‌ను కూడా నిరోధించవచ్చు. ముల్లంగిలో మధుమేహాన్ని నియంత్రించే గుణాలు ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి. ఇందులో బయోయాక్టివ్ సమ్మేళనాలు కనిపిస్తాయి. ఇది అడిపోనెక్టివ్ అనే హార్మోన్‌ను నియంత్రిస్తుంది. ఈ హార్మోన్ చక్కెర స్థాయిని నియంత్రించడానికి సహాయపడుతుంది.
రక్తపోటును నియంత్రిస్తుంది..
గుండె రక్తపోటులో మేలు చేసే విధంగా ముల్లంగిలో పోటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో పనిచేస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరిచి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ముల్లంగిలో కరిగే, కరగని పైబర్స్ ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు ఉపయోగకరంగా ఉంటాయి. పైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యకరంగా ఉంచుతుంది. ముల్లంగి తింటే అజీర్తి, మలబద్ధకం దరిచేరవు.
– శ్రీనివాస్, ఆయుష్ ప్రభుత్వ వైద్యాధికారి
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
- Tags
- AYUSH
- blood pressure
- Cancer
- control
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

