e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 18, 2022
Home రంగారెడ్డి కొనుగోలు కేంద్రాల్లో నాణ్యత పాటించాలి

కొనుగోలు కేంద్రాల్లో నాణ్యత పాటించాలి

  • గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలి
  • జిల్లా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌

ధారూరు, నవంబరు 30: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నా ణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటించి కొనుగోలు చేయాలని వికారాబాద్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం ధారూరు వ్యవసాయ కార్యాలయంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, మండల పరిధిలోని దోర్నాల్‌ గ్రామంలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రా న్ని జిల్లా అధికారులు, మండల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భం గా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ రైతుల నుంచి నాణ్యతా ప్రమాణాల మేరకు ధాన్యం కొనుగోలు చేయాలని, నిబంధనల ప్రకారం తేమ 17శాతం చూసుకోవాలని తెలిపా రు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్‌ మిల్లులకు తరలించాలన్నారు. రైతుల నుంచి కొనుగోలు(సేకరించిన) చేసిన ధాన్యం వివరాలను వెంటనే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. రైతులకు అవసరమైన గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలని తెలిపారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా పనులు సజావుగా నిర్వహించాలని సూచించారు. రైతు వేదికల్లో సమావేశాలు నిర్వహించి వచ్చే యాసంగిలో వరి పంటకు బదులు ప్రత్యామ్నాయ పంటలు పండించుకొని అధిక లాభాలు పొందాలన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే ధాన్యంలో దుమ్ము, ధూళి లేకుండా తీసుకురావాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం ఆరబెట్టుకోరాదని సూచించారు. కార్యక్ర మంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజేశ్వర్‌, జిల్లా పౌర సరఫరాల మేనేజర్‌ విమల, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్‌, డీసీవో సుజాత, డీపీఎం వీరయ్య, ధారూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మ న్‌ సంతోష్‌కుమార్‌, తహసీల్దార్‌ బీమయ్య గౌడ్‌, మండల వ్యవసాయ శాఖ అధికారి జ్యోతి, ఏఈవో సంజీవ్‌ రాథోడ్‌, అధికారులు ఉన్నారు.

తృణ ధాన్యాలతో ఆరోగ్యం పదిలం
ఖర్చు తక్కువ లాభాలు ఎక్కువ అందించే తృణ ధాన్యాలతో పదికాలాల పాటు ఆరోగ్యం పదిలంగా ఉంటుందని అడిషనల్‌ కలెక్టర్‌ మోతీలాల్‌ అన్నారు. మంగళవారం రాస్నం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం రైతు వేదికలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ యాసంగిలో ఆరుతడి పంటలపై అవగాహన కల్పించారు. యాసంగిలో వరికి బదులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని రైతులకు సూచించారు. భూ సారం కాపాడుకునే విధంగా రైతులు ఆరు తడి పంటలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి గోపాల్‌ అన్నారు. శాస్త్రవేత్త ప్రవీణ్‌ మాట్లాడుతూ.. ఆరుతడి పంటలకు సర్వ సాధారణంగా వచ్చే లద్దె పురుగు నివారణకు తీసుకోవా ల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు యమున, సందీప్‌, ఉప సర్పంచ్‌ జనార్దన్‌రెడ్డి, ఎం ఏవో జ్యోత్స్న ప్రియదర్శిని, ఏఈవో శ్యాంసన్‌, వెంగల్‌ రెడ్డి, రామ చందర్‌రెడ్డి , రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement