పరీక్ష పేరెంట్స్ కే!
తమ పిల్లలు బాగా చదివి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు కూడా శ్రమిస్తున్నారు. పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకుని పరీక్షలకు ప్రిపేర్ చేయిస్తున్నారు. పిల్లల సందేహాలను నివృత్తి చేస్తూ కష్టమనే సబ్జెక్టులపై ఇష్టం పెరిగేలా వసతులు కల్పిస్తున్నారు.
- బుజ్జగిస్తూ.. వెంటపడుతూ బోధన
- పిల్లల ఆసక్తికనుగుణంగా ముందుకు..
- ఇష్టపడి చదువుకునేలా ఏర్పాట్లు
తమ పిల్లలు బాగా చదివి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు కూడా శ్రమిస్తున్నారు. పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకుని పరీక్షలకు ప్రిపేర్ చేయిస్తున్నారు. పిల్లల సందేహాలను నివృత్తి చేస్తూ కష్టమనే సబ్జెక్టులపై ఇష్టం పెరిగేలా వసతులు కల్పిస్తున్నారు. ఫోన్లు, టీవీలకు దూరంగా ఉండేలా చూస్తున్నారు. ‘నాన్నా.. చిట్టి.. బుజ్జి బాగా చదువాలి… హ్యాండ్ రైటింగ్ అందంగా ఉండాలె… క్లాస్‌లో ఫస్ట్ రావాలె..’ అంటూ పిల్లలకు పదేపదే మొరపెట్టుకుంటున్నారు. ఇవి ఎల్కేజీ, యూకేజీ, ఒకటి, రెండో తరగతి చిన్నారులకు అమ్మానాన్నలు చెబుతున్న మాటలు. పరీక్షలకు సిద్ధం చేసేందుకు కొందరు ప్రోగ్రాములనూ వదిలేస్తున్నారు. పిల్లలను ఆడిస్తూ.. వారితో చదివించేందుకు పుస్తకాలతోనూ కుస్తీ పడుతున్నారు.
పెద్దఅంబర్‌పేట, ఏప్రిల్ 15 : ‘నాన్నా బాగా చదువు. ఒక్కటి కూడా మిస్ కావొద్దు. హ్యాండ్ రైటింగ్ నీట్‌గా ఉండాలి. క్లాస్‌లో ఫస్ట్ రావాలి’ ఓ కూతురితో తండ్రి మాట ఇది. ‘చదువుకోకపోతే నిన్ను ఎవరూ పట్టించుకోరు. ప్లీజ్ బిడ్డా ఇంకో గంట చదువుకో’
కుమారుడికి ఓ తల్లి విజ్ఞప్తి..
ఇవి ఏ పదో తరగతో, ఇంటరో, డిగ్రీ, ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులతో తల్లిదండ్రులు అంటున్న మాటలు కావు. ఎల్కేజీ, యూకేజీ, ఒకటి, రెండో తరగతి చదువుతున్న పిల్లలతో అమ్మానాన్నలు పెట్టుకుంటున్న మొరలు ఇవి.
చిన్నారులకు పరీక్షలంటేనే నేటి తరం తల్లిదండ్రుల్లో టెన్షన్ మొదలవుతున్నది. పిల్లలను పరీక్షలకు సిద్ధం చేసేందుకు కొందరు తల్లిదండ్రులు వీకెండ్ పార్టీలు కట్ చేసేశారు. మరికొందరు ఆఫీస్ నుంచి ఓ గంట పర్మిషన్ తీసుకుని ముందే వచ్చి డోర్ కొడుతున్నారు. పిల్లలను ఆడిస్తూ.. వారితో చదివించేందుకు కుస్తీలు పడుతున్నారు.
ఉత్సాహం నింపేలా..
చిన్నారులు చదువుపై శ్రద్ధపెట్టేలా వారితో కలిసి పుస్తకాలు పడుతున్నారు నేటి తరం తల్లిదండ్రులు. టీవీలు కట్టేసి, ఫోన్లు పక్కన పెట్టేస్తున్నారు. పిల్లల్లో ఏకాగ్రతను పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉత్సాహంగా చదువుకునేలా ప్రోత్సాహకరమైన వాతావరణం సృష్టిస్తున్నారు. చిన్నారుల ప్రతి కదలికను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వారు ఎక్కడ వెనుకబడుతున్నారో గుర్తిస్తూ ఆయా అంశాల్లో ముందుంచేలా సహకారం అందిస్తున్నారు.
పక్కాగా ప్లాన్..
పిల్లల పరీక్ష కోసం తల్లిదండ్రులు ప్రణాళికాబద్ధంగా సిద్ధమవుతున్నారు. పిల్లల పరీక్షలకు సంబంధించిన సబ్జెక్టులను ముందుగానే ఓసారి పరిశీలిస్తున్నారు. ఆయా సబ్జెక్టులను పిల్లలకు సులువుగా అర్థమయ్యేందుకు ఎలాంటి విధానంలో బోధించాలనే అంశాలపై తర్జనభర్జన పడుతున్నారు. అర్థంకాని అంశాల గురించి గూగుల్‌లో శోధిస్తున్నారు. ప్రతి అంశాన్ని ఉదాహరణలతో సహా చెప్తూ.. పిల్లల్లో ఆసక్తి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. పిల్లల కోసం సోషల్ మీడియాను దూరం పెట్టి.. వారికి దగ్గరవుతున్నారు. వారితో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నిస్తున్నారు. పిల్లలతో చదివించడమే కాదు, వారి కోసం ప్రత్యేకంగా పరీక్ష మోడల్ పేపర్లు తయారుచేస్తున్నారు. ఇంట్లోనే పిల్లలతో పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. పిల్లల సబ్జెక్టుల విషయంలో సందేహాలొస్తే నేరుగా వారి టీచర్లతో మాట్లాడుతున్నారు. సందేహాలు నివృత్తి చేసుకుంటున్నారు. పిల్లలకు మరింత సులువుగా అర్థమయ్యే రీతిలో చెప్తున్నారు. కష్టమనే సబ్జెక్టులపై ఇష్టం పెరిగేలా వసతులు కల్పిస్తున్నారు. వినూత్నంగా బోధన ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. పిల్లలకు ఇష్టమైన తినుబండారాలను అందిస్తూ వారిని ఆకట్టుకుంటున్నారు.
ఒత్తిడి లేకుండా..
తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి పెట్టకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. పిల్లలు ఉత్సాహంగా ఉండే వాతావరణం సృష్టిస్తున్నారు. పిల్లలతో కాసేపు బయటకు వెళ్తున్నారు. పార్కుల బాట పడుతూ.. వారితో అడుగులు వేస్తున్నారు. చిన్నారులను ఆడిస్తున్నారు. పాడిస్తున్నారు. పిల్లల ఆసక్తికి అనుగుణంగా వారి ఇష్టాలను తీరుస్తున్నారు. కాసేపు చదువు.. మరికాసేపు పిల్లల ఇష్టాలకు అనుగుణంగా వారితో కలిసి పెయింటింగ్ వేస్తున్నారు. వాకింగ్, రన్నింగ్, ఇతర ఆటలు ఆడుతున్నారు. తల్లిదండ్రులిద్దరూ పిల్లల చదువు కోసం తగిన సమయం కేటాయించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

