రంగారెడ్డి : జిల్లాలోని మొయినాబాద్ మండల పరిధిలోని చిలుకూరు బాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మంగళవారం రెండోరోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహించారు. ధ్వజారోహణం అనంతరం గరుత్మంతునికి నైవేద్యంగా సమర్పించిన గరుడ ప్రాసాదాన్ని సంతానం లేని మహిళలకు పంపిణీ చేశారు. గరుడ ప్రసాదం స్వీకరిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మకంతో భక్తులు గరుడ ప్రసాదం కోసం తరలి వచ్చారు. గరుడ ప్రసాదం కోసం భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఉదయం 5 గంటలకే ఆలయానికి చేరుకున్నారు.