మ్యాంగో మార్కెట్ యార్డులో తనిఖీలు
గడ్డిఅన్నారం పరిధిలో గల బాటసింగారం పండ్ల మార్కెట్లోని మ్యాంగో మార్కెట్ యార్డులను ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటీవ్ మెడిసిన్ (ఐపీఎం) డైరెక్టర్ శివలీల ఆధ్వర్యంలో సోమవారం ఫుడ్ సేఫ్టీ అథారిటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
- 37 క్రేట్ల మామిడిపండ్లను సీజ్ చేసిన అధికారులు
అబ్దుల్లాపూర్‌మెట్, మార్చి 26 : గడ్డిఅన్నారం పరిధిలో గల బాటసింగారం పండ్ల మార్కెట్లోని మ్యాంగో మార్కెట్ యార్డులను ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటీవ్ మెడిసిన్ (ఐపీఎం) డైరెక్టర్ శివలీల ఆధ్వర్యంలో సోమవారం ఫుడ్ సేఫ్టీ అథారిటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఏకకాలంలో అన్ని షెడ్లలో తనిఖీలు నిర్వహించగా మార్కెట్ యార్డులో ఖరీదుదారులందరూ దాదాపు ఫుడ్ సేఫ్టీ ప్రమాణాల ప్రకారమే మ్యాంగో ప్యాకింగ్ చేస్తున్నారని అధికారులు తెలిపారు.
కాగా.. ఒక ఖరీదుదారుడు కుమార్ అగర్వాల్ అదనంగా ఎథిలైన్ ప్యాకెట్లు వేసి మ్యాంగో ప్యాకింగ్ చేస్తున్నందున వారి 37 క్రేట్ల మామిడి పండ్లను సీజ్ చేసినట్లు తెలిపారు. ఇక నుంచి ఎవరైనా ఖరీదుదారు అనుమతికి మించి అధిక మొత్తంలో ఎథిలైన్ ప్యాకెట్లు వాడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ప్యాకింగ్ ఏ విధంగా చేయాలో హమాలీలకు శిక్షణ ఇచ్చారు.
కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ అథారిటీ డిప్యూటీ ఫుడ్ కంట్రోలర్ విజయ్‌కుమార్, చీఫ్ ఫుడ్ అనలిస్ట్ జీఎల్ఎన్ రెడ్డి, ఏఎఫ్సీ ఖలీల్, ఫ్రూట్ మార్కెట్ కార్యదర్శి నర్సింహరెడ్డి, యార్డు ఇన్చార్జి లాబన్, సూపర్వైజర్లు మురళీధర్, ధర్మేంద్ర, డీవో సంగారెడ్డి నాయక్, డీవో నిజామాబాద్ ఉదయ్‌కిరణ్, ఎఫ్ఎస్వో రంగారెడ్డి సునీత, ఎఫ్ఎస్వో కామారెడ్డి జగన్నాథం, ఎఫ్ఎస్వో వికారాబాద్ ఉన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

