రంగారెడ్డి, జనవరి 31, (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లా కలెక్టర్‌గా నారాయణరెడ్డి, రంగారెడ్డి కలెక్టర్‌గా ఎస్.హరీశ్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వికారాబాద్ కలెక్టర్‌గా పనిచేస్తున్న కె.నిఖిలను బదిలీ చేస్తూ నిజామాబాద్ కలెక్టర్‌గా పనిచేస్తున్న నారాయణరెడ్డిని వికారాబాద్ కలెక్టర్‌గా నియమిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.
రంగారెడ్డి కలెక్టర్‌గా పని చేస్తున్న అమయ్‌కుమార్ మేడ్చల్ – మల్కాజిగిరి కలెక్టర్‌గా బదిలీ కాగా, మెదక్ కలెక్టర్‌గా, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఇన్చార్జి కలెక్టర్‌గా కొనసాగిన హరీశ్ రంగారెడ్డి కలెక్టర్‌గా బదిలీపై వచ్చారు.