ఖైరతాబాద్, అక్టోబర్ 3: పీఎం కుసుమ్ పథకం కింద సోలార్ విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు చేసిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారవేత్తలుగా కాకుండా రైతులుగానే గుర్తించి అండగా నిలవాలని పీఎం కుసుమ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రాజు కోరారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ టీ రమేశ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు రైతులు భారీగా అప్పులు చేసి పెట్టుబడులు పెట్టారని, ప్రస్తుతం టారిఫ్ తగ్గింపు కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురొంటున్నారని తెలిపారు. తెలంగాణలో పీఎం కుసుమ్ కింద విద్యుదుత్పత్తి చేస్తున్న రైతులు సగటున యూనిట్‌ను రూ.3.13కే డిసమ్లకు అందిస్తున్నారని రమేశ్ చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసే సోలార్ విద్యుత్తు టారిఫ్‌లో యూనిట్‌కు 6 పైసలు తగ్గించడం వల్ల తమపై అదనపు ఆర్థిక భారం పడుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.